ఒక్క క్షణం.. అదిరిపోయే డీల్?

ఒక్క క్షణం.. అదిరిపోయే డీల్?

అల్లు శిరీష్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘ఒక్క క్షణం’ టైటిల్ లోగో పోస్టర్.. ఫస్ట్ లుక్.. ఫస్ట్ టీజర్ వారం వ్యవధిలో వచ్చాయి. ఇవి మూడూ కూడా ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించాయి. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో ఒక్కసారిగా తనపై అంచనాలు పెంచేసిన యువ దర్శకుడు వీఐ ఆనంద్.. మరోసారి అలాంటి మ్యాజిక్కే రిపీట్ చేసేలా కనిపిస్తున్నాడు ఈ సినిమాతో. ‘ఒక్క క్షణం’ టీజర్ ట్రెండ్ అయిన తీరు.. దీనికి వచ్చిన వ్యూస్.. దీనిపై సామాజిక మాధ్యమాల్లో జరిగిన చర్చ చూశాక.. దీనికి అదిరిపోయే శాటిలైట్ డీల్ వచ్చినట్లు సమాచారం.

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ జెమిని.. ‘ఒక్క క్షణం’ శాటిలైట్ హక్కుల్ని రూ.4.05 కోట్లకు కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ‘ఒక్క క్షణం’ నిర్మాత జాక్ పాట్ కొట్టినట్లే. అల్లు శిరీష్ రేంజికి ఇది చాలా పెద్ద మొత్తమే. నిజానికి అతడికి పెద్దగా మార్కెట్ లేదు. శిరీష్ ఇప్పటిదాకా మూడు సినిమాల్లో నటించాడు కానీ.. చివరగా చేసిన ‘శ్రీరస్తు శుభమస్తు’ మాత్రమే సక్సెస్ అయింది. ఐతే ‘ఒక్క క్షణం’ విషయంలో శిరీష్ కంటే దర్శకుడు ఆనందే అట్రాక్షన్ అవుతున్నాడు. తెలుగులో ఫాంటసీ టచ్ ఉన్న సైంటిఫిక్ థ్రిల్లర్లు చాలా అరుదు. ఆ జానర్లో రాబోతున్న భిన్నమైన సినిమాలా ఉంది ‘ఒక్క క్షణం’. ఈ చిత్రానికి ఓవరాల్ గా మంచి బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సురభి, సీరత్ కపూర్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు