పూరీ కథలాగే మాన్సూన్ షూటవుట్

పూరీ కథలాగే మాన్సూన్ షూటవుట్

మాన్సూన్ షూటవుట్ అని బాలీవుడ్ లో ఓ సినిమా రూపొందింది. 2013లోనే పూర్తయిన ఈ సినిమాని అదే ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని.. పోలీసుల నేపథ్యంలో గ్యాంగ్ వార్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు.

అమిత్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన మాన్సూన్ షూటవుట్ ను ఈ నెల 15న కమర్షియల్ రిలీజ్ చేయనుండగా.. ఇప్పుడీ చిత్రానికి ట్రైలర్స్ ను రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్.. భలే క్రిస్పీగా ఆకట్టుకుంటోంది. లాస్ట్ షాట్ లో విలన్ ను షూట్ చేయాలా వద్దా అనే దగ్గర ఆలోచనలో పడిపోతుంది లీడ్ క్యారెక్టర్.

ప్రతీ పని చేయడానికి మూడు దారులు ఉంటాయని అమ్మ చెప్పిన మాటలు ఆ పాత్రకు గుర్తొస్తాయి. సరైన దారి.. తప్పుడు దారి.. మధ్యస్తంగా ఉండే దారి.. అంటూ అమ్మ చెప్పే దగ్గర ఆగిపోతాడు. ఇప్పుడు షూట్ చేయాలా.. మానేయాలా అనేది ఆ క్యారెక్టర్ కన్ ఫ్యూజన్.

ఈ క్వశ్చన్ మార్క్ తో.. దేవుడు చేసిన మనుషులు మూవీలో పూరీ జగన్నాధ్ ఇలాగే హంగామా చేసిన సంగతి గుర్తు రావడం ఖాయం. అరటి తొక్కపై కాలేస్తే ఏంటి.. కాలు వేయకపోతే ఏంటి అంటూ రెండు యాంగిల్స్ చూపిస్తాడు పూరి. ఇప్పుడు మాన్సూన్ షూటవుట్ అయినా అంతే కదా.. షూట్ చేస్తే ఒక పరిస్థితి.. చేయకపోతే ఓ పరిస్థితి. ఈ కాప్ డ్రామాకి ఇన్ స్పిరేషన్ పూరీ అనేయలేం కానీ.. యాంగిల్ మాత్రం అలాగే ఉంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు