నామినేష‌న్ వేసిన న‌టుడ్ని రాజీనామా చేయ‌మంటున్నారు

నామినేష‌న్ వేసిన న‌టుడ్ని రాజీనామా చేయ‌మంటున్నారు

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఎంత‌లా మారిపోయాయో తెలిసిందే. అమ్మ మ‌ర‌ణంతో ఏర్ప‌డిన ఖాళీని భ‌ర్తీ చేసేందుకు ఆర్కే న‌గ‌ర్  లో ఉప ఎన్నిక‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆర్కేన‌గ‌ర్ బ‌రిలో ప్ర‌ముఖ న‌టుడు విశాల్ ఎంట్రీ ఇవ్వ‌టం.. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు. నామినేష‌న్ దాఖ‌లు చేసిన ఆయ‌న్ను రాజీనామా చేయాలంటూ డిమాండ్లు ఎక్కువుతున్నాయి.

నామినేష‌న్ వేసినంత‌నే రాజీనామా చేయాల‌ని కోర‌టం ఏమిట‌న్న సందేహం అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం విశాల్ నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన ఆయ‌న్ను త‌న ప‌ద‌వికి త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విశాల్ వ్య‌తిరేక వ‌ర్గం ఇప్పుడు స్వ‌రాన్ని పెంచి.. విశాల్ ను నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడిగా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున‌నారు.

నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విశాల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని పోరాడుతున్నారు హీరో క‌మ్ ద‌ర్శ‌కుడు చేర‌న్‌. విశాల్‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తామంటున్నారు. తొలిసారి పోటీతోనే న‌కిలీ ముఖంతో ఎవ‌రి ప్రేర‌ణ‌తో విశాల్ వ్యాపార గుర్రంగా మారార‌ని ఆరోపించారు.

ద‌క్షిణ భార‌త న‌టీన‌టుల సంఘం ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వెంట‌నే డీఎంకే అధినేత క‌రుణానిధిని క‌లిసి ఆశీస్సులు అందుకున్న విశాల్‌.. తాజాగా ఎంజీఆర్‌.. జ‌య‌ల‌లిత స‌మాధుల‌కు నివాళులు అర్పించి స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌టాన్ని ప్ర‌శ్నిస్తున‌నారు. విశాల్  ఉప ఎన్నిక‌ల బరిలో నిల‌వ‌టం వ‌ల్ల బ‌జారున ప‌డేది నిర్మాత‌లేన‌ని ఆయ‌న మండిప‌డుతున్నారు.
నిజంగా నిర్మాత శ్రేయ‌స్సు కోరితే వెనువెంట‌నే త‌న ప‌ద‌వికి విశాల్ రాజీనామా చేయాల‌ని చేర‌న్ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిక‌ల బ‌రిలో విశాల్ దిగ‌టంతో నిర్మాత‌ల‌కు ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి సాయం అంద‌ద‌న్న భ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. త‌న నామినేష‌న్ తో ఇప్ప‌టికే సంచ‌ల‌నంగా మారిన విశాల్ కు ప్ర‌జ‌లు ఎంత‌మేర ద‌న్నుగా నిలిచార‌న్న విష‌యం త్వ‌ర‌లోనే తేలిపోనుంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English