వసూళ్లు లేక బాక్సాఫీస్‌ విలవిల

వసూళ్లు లేక బాక్సాఫీస్‌ విలవిల

నవంబర్‌ అంతా చెప్పుకోతగ్గ విజయాలు లేక విలవిల్లాడిన తెలుగు సినిమా మార్కెట్‌కి ఈవారంలోను ఉపశమనం లభించలేదు. సాయి ధరమ్‌ తేజ్‌, గోపిచంద్‌ సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి కనుక బాక్సాఫీస్‌ పుంజుకుంటుందని ఆశించారు. కానీ ఆ ఛాయలు కూడా కనిపించలేదు. రెండు చిత్రాలకీ మొదటి రోజున సంతృప్తికర వసూళ్లు వచ్చాయి కానీ ఆ తర్వాత మాత్రం రెండిటి వసూళ్లు పడిపోయాయి. గోపీచంద్‌ ఆక్సిజన్‌కి డిజాస్టర్‌ టాక్‌ రావడంతో దారుణమైన వసూళ్లతో రన్‌ అవుతోంది.

సాయిధరమ్‌ తేజ్‌ చిత్రం జవాన్‌కి యావరేజ్‌ టాక్‌ అయితే వుంది కానీ వసూళ్ల పరంగా మాత్రం డల్‌గానే వుంది. వీటితో పాటు విడుదలైన డబ్బింగ్‌ చిత్రం ఇంద్రసేన ఫ్లాప్‌ టాక్‌ని మూటగట్టుకుంది. వసూళ్లు ఇంత దారుణంగా వుండడంతో బయ్యర్లు కంగారు పడిపోతున్నారు. థియేటర్‌ రెంట్లకి కూడా కొన్ని చోట్ల జేబుల్లోంచే పెట్టుకోవాల్సి వస్తోందట.

డిసెంబర్‌ 21 వరకు మళ్లీ భారీ సినిమాలు లేవు కనుక ఈ పరిస్థితి మరో పదిహేను రోజుల పాటు తప్పేట్టు లేదు. మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి, హలో చిత్రాలతో మళ్లీ ఊపొస్తుందని మార్కెట్‌ వర్గాలు ఆశిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు