దిల్‌ రాజుని కూడా రిజెక్ట్‌ చేసేసింది

దిల్‌ రాజుని కూడా రిజెక్ట్‌ చేసేసింది

తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రీమ్‌ లాంఛ్‌ ఇచ్చిన ఫిదా నిర్మాత దిల్‌ రాజుకి వెంటనే 'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి' చిత్రం సైన్‌ చేసిన సాయి పల్లవి అతని బ్యానర్లో ముచ్చటగా మూడో సినిమా చేసే అవకాశం వస్తే సున్నితంగా తిరస్కరించేసింది. తనకి వున్న క్రేజ్‌ ఏమిటనేది సాయి పల్లవికి బాగా ఎరుక.

అయితే ఆ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవడం కోసం వచ్చిన ఆఫర్లన్నీ ఓకే చేయకూడదని తెలుసుకుంది. తనకి ప్రత్యేక గుర్తింపు తెచ్చే క్యారెక్టర్స్‌ అయితేనే సాయి పల్లవి ఓకే చేస్తోంది. నటిగా పేరు తెచ్చే పాత్ర వున్నట్టయితే అందులో హీరో ఎవరనేది కూడా ఆమె పట్టించుకోవడం లేదు.

దిల్‌ రాజు ఆమెకి భారీ పారితోషికం ఆఫర్‌ చేసినా కానీ తనకి ఆఫర్‌ చేసిన క్యారెక్టర్‌ ఎక్సయిటింగ్‌గా అనిపించకపోవడం వల్ల సాయి పల్లవి నో చెప్పిందట. ఫిదాలో మాదిరిగానే మిడిల్‌క్లాస్‌ అబ్బాయిలోను సాయి పల్లవి డామినేటింగ్‌ క్యారెక్టర్‌ చేస్తోంది. మొహమాట పడే నాని పాత్రకి ఎదురెళ్లి ప్రపోజ్‌ చేసి అతనికి ప్రేమ పాఠాలు చెప్పే ఈ పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా వుంటుందట.

అలాంటి ప్రత్యేక లక్షణాలేం లేని పాసివ్‌ పాత్రని 'శ్రీనివాస కళ్యాణం'లో ఆఫర్‌ చేసేసరికి తనకి టాలీవుడ్‌లో బ్రేక్‌ ఇచ్చిన నిర్మాత అని కూడా లేకుండా చేయననేసిందట. దాంతో నితిన్‌ హీరోగా నటిస్తోన్న ఆ చిత్రంలో కథానాయికగా పూజ హెగ్డేని తీసుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు