ఫ్లాప్‌ తమన్నాకి ఇంకో హోప్‌

ఫ్లాప్‌ తమన్నాకి ఇంకో హోప్‌

ఒక టైమ్‌లో తెలుగులో అగ్ర హీరోలందరితో నటిస్తూ యమ బిజీగా వున్న తమన్నా ఏకంగా బాహుబలి చిత్రాన్ని సైతం చేజిక్కించుకుంది. కానీ తన టైమ్‌ బ్యాడ్‌ అవడం వల్ల అటు తన ఇతర చిత్రాలు ఫెయిలవడంతో పాటు బాహుబలి కూడా తనకి ఎలాంటి ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టలేదు.

తెలుగు, తమిళం, హిందీ అంటూ అన్ని భాషల్లోను చక్కర్లు కొడుతోన్న తమన్నాకి బాలీవుడ్‌లో అయితే ఇంతవరకు అసలు అదృష్టమే కలిసి రాలేదు. వరుసపెట్టి చాలా డిజాస్టర్‌ సినిమాల్లో నటించిన తమన్నాకి మరోసారి హోప్‌ ఇస్తూ ఫర్హాన్‌ అక్తర్‌ సినిమాలో అవకాశం దక్కింది.

తమిళంలో విజయవంతమైన జిగరదండా చిత్రానికి రీమేక్‌ అయిన ఈ చిత్రంలో ఫర్హాన్‌ సరసన తమన్నా నటిస్తోంది. ఇటీవల అవకాశాలు లేక స్టార్‌ హీరోలతోనే చేస్తానంటూ కూర్చోకుండా అవకాశం ఇచ్చిన ఎవరితో అయినా సరే అంటోన్న తమన్నా తన కెరియర్‌కి మళ్లీ చిన్నపాటి రైజ్‌ త్వరలోనే వస్తుందని ఆశిస్తోంది.

కాజల్‌ బౌన్స్‌ బ్యాక్‌ అయినట్టుగా తనకీ టైమ్‌ వస్తుందని ఆశపడుతూ వచ్చిన సినిమాలకి రెమ్యూనరేషన్‌లో రిబేటు కూడా ఇస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు