పెళ్ళయిన హీరోయిన్ ని భలే ఎత్తేశారే!!

పెళ్ళయిన హీరోయిన్ ని భలే ఎత్తేశారే!!

పెళ్లి తర్వాత హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేయడం.. మిగిలిన భాషల సంగతేమో కానీ టాలీవుడ్ లో మాత్రం ఇది అసంభవం అనిపించేస్తుంది. స్టార్ హీరోయిన్స్ గా వెలిగిపోయిన వారు కూడా.. పెళ్లి తర్వాత సైడ్ అయిపోవాల్సిందే. గతంలో స్వచ్ఛందంగానే వారు వెళ్లిపోయేవారు. ఇప్పుడైతే  ఆఫర్స్ ఇవ్వడం మానేసి ఫిలిం మేకర్స్ బలవంతంగా పంపేస్తున్నారు.. అంతే తేడా.

సిమ్రాన్ లాంటి స్టార్స్ కు ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం అయితే సమంత సిట్యుయేషన్ అగమ్యగోచరంగానే ఉంది. పెళ్లి తర్వాత తాను సినిమాలు చేస్తాను మొర్రో అని సామ్ చెబుతున్నా సరే.. ఇప్పటివరకూ ఒక్క స్టార్ హీరో సినిమాలో కూడా కొత్తగా ఆమె పేరు వినిపించలేదు. అందుకే అప్పుడెప్పుడో అనుకున్న కన్నడ యూ-టర్న్ రీమేక్ తెరపైకి వచ్చింది. కానీ మళ్లీ రావా మూవీతో టాలీవుడ్ పరిచయం అవుతున్న ఆకాంక్ష సింగ్ విషయంలో మాత్రం విభిన్నంగా ఉంది పరిస్థితి. సీరియల్ నటి అయిన ఆకాంక్షకు ఇప్పటికే పెళ్లయిపోయింది. పిల్లలు కూడా ఉన్నారనే టాక్ ఉంది కానీ.. వాస్తవాలు తెలియదు.

మళ్లీ రావా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాబోయే స్టార్ హీరోయిన్ ఆకాంక్ష అని అంతా ఆకాశానికి ఎత్తేశారు. ఓ పెళ్లయిన భామకు ఈ రేంజ్ లో టాలీవుడ్ వెల్ కం చెప్పడం ఇదే మొదటి సారి. నిజంగా ఆకాంక్ష ఆ రేంజ్ కు చేరుకుంటే మాత్రం.. టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలయినట్లే. మరోవైపు.. సుమంత్ గత చిత్రం నరుడా డోనరుడా చిత్రంలో నటించిన పల్లవి సుభాష్ కూడా పెళ్లయిన భామే అంటారు. ఇప్పుడు ఆకాంక్ష సింగ్ ను ఎంకరేజ్ చేస్తున్నాడు సుమంత్. హీరోయిన్స్ గా ఇలా పెళ్లయిన భామలను ప్రోత్సహిస్తున్న సుమంత్ ను ప్రశంసించాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు