సునీల్ అంతగా మారిపోయాడా!?

సునీల్ అంతగా మారిపోయాడా!?

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ కెరీర్ ప్రస్తుతం ఇబ్బందుల్లోనే ఉంది. ఈ నెలలో రిలీజ్ కానున్న మలయాళ రీమేక్ 2కంట్రీస్ చిత్రంపై సునీల్ చాలానే హోప్స్ పెట్టుకున్నాడు. ఈ చిత్రం తర్వాత మళ్లీ తను బిజీ అవుతానని కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు సునీల్. మరోవైపు హీరో పాత్రల్లో మాత్రమే నటించాలన్న తన పట్టుదలను కూడా సడలించుకుంటున్నాడని తెలుస్తోంది.

మహానంది.. ఎవడైతే నాకేంటి.. సింహరాశి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వి సముద్ర.. ప్రస్తుతం.. కొత్త యాక్టర్లతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మధ్యనే మళ్లీ విలన్ వేషాలను ప్రారంభించిన శ్రీకాంత్.. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు కూడా. అయితే.. స్క్రిప్ట్ ప్రకారం ఈ స్టోరీలో ఓ క్యామియో రోల్ ఉంటుందట. ఈ పాత్రలో సునీల్ నటిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో.. ఈ దర్శకుడు అప్రోచ్ కాగా.. సునీల్ కూడా ఓకే చెప్పేశాడట. సునీల్ ఇంత త్వరగా యాక్సెప్ట్ చేస్తాడని ఎక్స్ పెక్ట్ చేయని ఈ డైరెక్టర్.. షాక్ తినేశాడట. సునీల్ లో బాగా మార్పు వచ్చిందని.. కీలకమైన పాత్ర అనిపిస్తే ఓకే అంటాడనే ఫీలింగ్ కలిగిందని పలువురితో చెబుతున్నాడట.

మరోవైపు ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందే సినిమాలో కూడా సునీల్ నటించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో హీరో చుట్టూనే కథ ఉంటుంది. ఇతర క్యారెక్టర్లు చాలానే కనిపించినా.. సపోర్టింగ్ గా ఉంటాయంతే. మరి తన స్నేహితుడు అయిన సునీల్ తో త్రివిక్రమ్ ఎలాంటి రోల్ చేయించనున్నాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు