ఫైట్ మాస్టర్ చెప్పిన ఫ్యాక్ట్స్

ఫైట్ మాస్టర్ చెప్పిన ఫ్యాక్ట్స్

పీటర్ హెయిన్స్ గురించి తెలుగు ఆడియన్స్ కు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చదువు చెప్పించకపోయినా.. తన తండ్రి నేర్పించిన మార్షల్ ఆర్ట్స్ తో ఫైటర్ గా కెరీర్ ఆరంభించి.. స్టంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్నత స్థాయికి ఎదిగాడు. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన స్టంట్స్ అంటే.. కచ్చితంగా కొత్త తరహాలో ఉంటాయనే గుర్తింపు సంపాదించుకున్నాడు.

మాస్ జనాలను మెప్పించడం కోసం ఇరికించే ఫైటింగ్ సీన్స్ అంటే తనకు పెద్దగా నచ్చదు అంటున్న పీటర్ హెయిన్స్.. స్టోరీలో భాగంగా ఫైటింగ్స్ ఉంటే ఆ కిక్ వేరుగా ఉంటుందని చెబుతున్నాడు. ఏ భాష అయినా.. అక్కడి స్థానిక జనాలను మెప్పించేలా స్టంట్స్ ఉండాలని భావిస్తాడట. ఇక తను కంపోజ్ చేసిన సినిమాలు అన్నీ తన కన్నబిడ్డల లాంటివే అంటున్న ఈ స్టంట్ మాస్టర్.. రాజమౌళితో ఎక్కువ సినిమాలు చేశానని.. త్రివిక్రమ్ తో బోలెడంత సాన్నిహిత్యం ఉందని చెబుతున్నాడు. మాటల మాంత్రికుడిని ఈయన డాడీ అని పిలుస్తాడట. తమ ఇద్దరి మధ్య అంతటి రిలేషన్ ఉందంటున్నాడు పీటర్ హెయిన్స్.

భారీగా ఫైటర్లను మొహరించి కంపోజ్ చేసే ఫైట్స్ లో కూడా.. ప్రతీ ఒక్కరికీ తనే డైరెక్షన్స్ ఇస్తాడట. వారిని గ్రూప్ లుగా విభజించి.. వారిలో ట్యాలెంట్ ఉన్న వారిని ముందు నుంచోబెట్టి.. ప్రోత్సహిస్తానని చెబుతున్నాడు పీటర్ హెయిన్స్. కానీ సెట్ లో మాత్రం ఓ అడవి జంతువులా వ్యవహరిస్తానని తనే చెప్పుకోవడం హైలైట్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English