నేనెప్ప‌టికీ మిడిల్ క్లాస్ అబ్బాయినే

నేనెప్ప‌టికీ మిడిల్ క్లాస్ అబ్బాయినే

గంటా నవీన్‌బాబు..... ఈ పేరు పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌క పోవ‌చ్చు....కానీ, హ‌రో నాని అన్న పేరు విన‌గానే ప్ర‌తి ఒక్క‌రికీ త‌మ ప‌క్కింటి అబ్బాయి గుర్తుకు వ‌స్తాడు. టాలీవుడ్ ప్రేక్ష‌కులు నానీని ఒక హీరోలా కాకుండా త‌మ ఇంట్లో, బంధువుల్లో, ఇరుగుపొరుగు ఇళ్ల‌లో ఉండే కుర్రాళ్ల‌తో పోల్చుకుంటారు. అందుకే, నాని `నేచుర‌ల్ స్టార్` గా పాపుల‌ర్ అయ్యాడు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా త‌న సినీ ప్ర‌యాణాన్ని ప్రారంభించిన నాని....ఆ త‌ర్వాత స్టార్‌ హీరోగా మారాడు. వ‌రుస‌గా ఏడు హిట్ల‌తో దూసుకుపోతున్న నాని త్వ‌ర‌లో `మిడిల్ క్లాస్ అబ్బాయి`గా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఈ సంద‌ర్భంగా ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నాని అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. తాను ఎంసీఏ లో నటించాను కాబ‌ట్టి, ఈమాట చెప్పడం లేద‌ని, తానెప్పటికీ మధ్య తరగతి మనిషినేన‌ని నాని అన్నాడు.

మధ్య తరగతి అనేది స్థాయి, పరిస్థితులు కావ‌ని, అది మన ఆలోచనా దృక్పథ‌మ‌ని నాని చెప్పాడు. ఎంసీఏలో కూడా ఇదే విష‌యాన్ని చెప్పామ‌న్నాడు. మనం ఏ స్థాయికి వెళ్లినా మ‌న‌ మైండ్‌సెట్‌ ఎప్పటికీ మారద‌న్నాడు. నటుడిగా తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ప్రేక్షకులే కార‌ణ‌మ‌ని, వాళ్లు త‌న‌ సినిమాల‌ను ఆద‌రించ‌డం వ‌ల్లే ఈ స్థాయికి వ‌చ్చాన‌ని చెప్పాడు.

తాను ఏ స్థాయికి వెళ్లినా తీరు మారద‌ని, డబ్బులుంటే కొత్త ప్లేటు వ‌స్తుంద‌ని, కానీ అందులో అమ్మమ్మ పెట్టిన పచ్చడి, అమ్మ చేసే పప్పు ఎప్పటికీ మారదని అన్నాడు. మిడిల్ క్లాస్ వాళ్లు కుటుంబం, బాధ్యతల విషయంలో జాగ్రత్తగా ఉంటార‌ని, ఎక్కడైనా గొడవ జరుగుతుంటే వెంటనే అందులోకి దూరిపోయి కాల‌ర్లు ప‌ట్టుకోవ‌డం వంటిది జరగద‌న్నాడు.

`ఎంసీఏ`ల‌కు కుటుంబం గుర్తుకొస్తుంద‌ని, వెంట తీసుకెళ్లిన బైక్ ను ఎక్కడ పార్క్‌ చేస్తే ఏమవుతుందో అనిపిస్తుంటుందని అన్నాడు.   మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి ఇలా ప్రతీ విషయంలో జాగ్రత్త ఉంటుంద‌ని, ఒక్కమాటలో చెప్పాలంటే ఒక‌ లెక్కమీద మధ్యతరగతి వాళ్లు బతికేస్తుంటారని చెప్పాడీ మిడిల్ క్లాస్ అబ్బాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English