ఆ వివాదంపై సాయిధరమ్ షాకింగ్ కామెంట్స్

ఆ వివాదంపై సాయిధరమ్ షాకింగ్ కామెంట్స్

సినీ పరిశ్రమలోని హీరోయిన్ల గురించి ఇటీవల ఓ ఎమ్మెల్యే చీప్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్లు రోజుకో భర్తను మారుస్తారని ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల మీద ఇండస్ట్రీ వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. దీనిపై సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐతే తమ్మారెడ్డి.. మెగా హీరో సాయిధరమ్ తేజ్‌ను ఇంటర్వ్యూ  చేస్తూ దీనిపై స్పందించాలని తేజును అడగ్గా అతను ఆశ్చర్యకర సమాధానం ఇచ్చాడు. ‘‘ఐ ఫీల్ సో హ్యాపీ.. మా ఇండస్ట్రీ గురించి.. మా పీపుల్ గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి మాట్లాడుతున్నారుగా’’ అని తేజు అన్నాడు. దీంతో తమ్మారెడ్డి.. ‘‘ఛీ దుర్మార్గుడా.. దుష్టుడా.. మీలాంటి వాళ్లున్న ఇండస్ట్రీ నుంచి నేను విరమిస్తున్నా’’ అంటూ జోక్ చేశారు.

తర్వాత తేజు కొంచెం సర్దుకుని.. ‘‘సార్ ఆయనేదో కాంట్రవర్సీ కోసం అన్నారని మనం కూడా కాంట్రవర్సీ అయ్యేలా ఇంకేదో అనడం సరికాదు. అతను మాట్లాడిందానికి విలువ లేదు. అలాంటపుడు మనమెందుకు రియాక్టవ్వాలి. అద్దాల మేడమీదే రాళ్లు ఎక్కువగా పడతాయని.. మనం అద్దాలను ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలనేదే ముఖ్యమని మా అమ్మ చెప్పింది. అందుకే నేను నేనలా రియాక్టయ్యాను’’ అని తేజు చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు