ఈ గ్యాంగ్ ఆ కథ కాదు కదా...

ఈ గ్యాంగ్ ఆ కథ కాదు కదా...

తమిళ హీరో సూర్య జనవరిలో ''గ్యాంగ్'' అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్‌ శివన్ డైరక్షన్లో రూపొందిన ఈ సినిమాను తమిళంలో సంక్రాంతికే వస్తున్నా కూడా.. తెలుగులో మాత్రం జనవరి 12న విడుదలవ్వడం కష్టమేలే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డిస్ర్టిబ్యూటర్ల సంఘం తమిళ డబ్బింగ్ సినిమాలు పెద్ద పండగలకు వారం తరువాతే రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ తో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు.

ఆ రిలీజ్ కథాకమామిషూ అటుంచితే.. అసలు ''గ్యాంగ్'' సినిమా కత ఏమైయుంటుంది అంటూ ట్రైలర్ చూస్తే ఒక సందేహం రాక మానదు. మనోడు మాస్ బాయ్ లా ఒకసారి.. సిబిఐ ఆఫీసర్ తరహాలో మరోసారి కనిపిస్తుంటే.. అనేక డౌట్లు వస్తున్నాయి. మఖ్యంగా ఇదంతా చూస్తుంటే.. హిందీలో వచ్చిన ''స్పెషల్ ఛబ్బీస్'' సినిమా కథ నుండి చాలావరకు లేపేసి.. ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ ను యాడ్ చేసి కొత్త కథ చేసినట్లే అనిపిస్తోంది కదూ? అసలు తెలుగులో ఆ సినిమాను రవితేజ హీరోగా ఎప్పుడో రీమేక్ చేయాల్సి ఉంది కాని.. ఎందుకో అది మెటీరియలైజ్ కాలేదు. కాని సినిమాలు లేటయ్యే కొద్ది ఇలాగే మన ఫిలింమేకర్లు కథను రకరకాలుగా ఎత్తేస్తారు.

సర్లేండి.. ఎప్పుడూ మసాలా సినిమాలను చేస్తూ అమావాస్యకు పౌర్ణమికీ కొత్త తరహా సినిమాలను చేసే సూర్య.. ఈసారి మాత్రం కొత్త సినిమాయే చేశాడని అనుకుందాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు