నితిన్‌కి అన్నీ పర్‌ఫెక్ట్‌గా కుదిరాయ్‌

నితిన్‌కి అన్నీ పర్‌ఫెక్ట్‌గా కుదిరాయ్‌

లై పరాజయంతో షేక్‌ అయిన నితిన్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌-పవన్‌కళ్యాణ్‌ సమర్పిస్తోన్న చిత్రం పనుల్లో బిజీగా వున్నాడు. అది పూర్తయిన తర్వాత తదుపరి రెండు చిత్రాలని దిల్‌ రాజుకి చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. దిల్‌ తర్వాత చాలా ఏళ్లకి మళ్లీ నితిన్‌తో సినిమా చేస్తోన్న రాజు దీనికోసం అన్నీ బ్రహ్మాండంగా సెట్‌ చేస్తున్నాడు.

శతమానం భవతి లాంటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన దర్శకుడు సతీష్‌ వేగేశ్న ఈసారి కూడా ఫ్యామిలీ కథనే ఎంచుకున్నాడు. 'శ్రీనివాస కళ్యాణం' టైటిల్‌తో రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనుంది. డిజె విడుదలకి ముందే మరో సినిమాకి పూజ డేట్స్‌ దిల్‌ రాజు సొంతం చేసుకున్నాడు.

వరుసగా చాలా సినిమాలు నిర్మిస్తున్నా కానీ నితిన్‌ చిత్రం కోసం పూజ డేట్స్‌ని వాడబోతున్నాడు. నితిన్‌ తన మార్కెట్‌ రేట్‌ కంటే చాలా తక్కువకి దిల్‌ రాజుకి సినిమాలు చేస్తున్నాడని, తన రేంజ్‌ పెంచే విజయాలు అందించి, టాప్‌లో నిలబెడతాడనే నమ్మకంతో నితిన్‌, సుధాకర్‌రెడ్డి ఇద్దరూ దిల్‌ రాజుపై నమ్మకం వుంచారని తెలిసింది.

కమర్షియల్‌గా వర్కవుట్‌ అయ్యే సినిమాలని వరుసగా చేస్తోన్న దిల్‌ రాజు ఇప్పుడు నితిన్‌ రేంజ్‌ పెంచే బాధ్యతని కూడా భుజానికి ఎత్తుకున్నాడన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు