బిచ్చగాడి ముచ్చట అయిపోయినట్టే

బిచ్చగాడి ముచ్చట అయిపోయినట్టే

బిచ్చగాడు బ్లాక్‌బస్టర్‌ అవడంతో విజయ్‌ ఆంటోని సినిమాలకి తెలుగునాట గిరాకీ ఏర్పడింది. అతని తదుపరి చిత్రం భేతాళుడుని భారీ స్థాయిలో విడుదల చేసారు. దానికి ఓపెనింగ్‌ కూడా బాగానే వచ్చింది కానీ సినిమా నిరాశపరిచింది. తర్వాత ఇంద్రసేనతో బిచ్చగాడు రిజల్ట్‌ రిపీట్‌ చేయాలని చూసాడు.

కానీ ఈ చిత్రానికి నామమాత్రపు ఓపెనింగ్‌ కూడా రాలేదు. ట్రెయిలర్‌లోనే ఇది ఒక సగటు సినిమా అనేది తేలిపోవడంతో ప్రేక్షకులు దీనిపై ఆసక్తి చూపించడం లేదు. దానికితోడు టాక్‌ కూడా బాలేకపోవడంతో వసూళ్లు మరింత పడిపోయాయి. బిచ్చగాడులా ప్రతి సినిమాతో హిట్టు కొట్టేస్తాడని ఆశ పడితే ఇలాగే వుంటుంది.

కథాబలం వుంటే తప్ప విజయ్‌ ఆంటోని లాంటి హీరోలు సినిమాలని నిలబెట్టలేరు. తమిళంలో రిజల్ట్‌ చూసుకుని తెలుగు అనువాద హక్కులు తీసుకుంటే మంచిది కానీ అతను చేసిన సినిమాలన్నీ ఎగబడి కొనేస్తూ పోతే ఇలాగే అవుతుంది.

తమిళ టాప్‌ హీరోల సినిమాలకే ఇక్కడ కాసులు రాలనపుడు ఇతడిని నమ్ముకుని రిస్కు చేయడం తెలివైన పని కాదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు