భ‌న్సాలీ న‌న్ను బాధ‌పెట్టాడు: స‌ల్లూ భాయ్‌

భ‌న్సాలీ న‌న్ను బాధ‌పెట్టాడు: స‌ల్లూ భాయ్‌

ప‌ద్మావ‌తి చిత్రంపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాకు ప‌లువురు బాలీవుడ్ న‌టీన‌టులు, ద‌ర్శ‌కనిర్మాత‌లు బాస‌ట‌గా నిలిచారు. ఆ చిత్ర ద‌ర్శ‌కుడు భ‌న్సాలీ, హీరోయిన్ దీపికా ప‌దుకొనేల పై దాడులు చేస్తామ‌న్న వారి వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. ఆ సినిమాను బ్యాన్ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను దుయ్య‌బ‌ట్టారు. తాజాగా, ఈ చిత్రంపై బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ స్పందించాడు. ఓ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆ సినిమాతోపాటు భ‌న్సాలీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆ చిత్రం ప్ర‌స్తుతం సెన్సార్ బోర్డు ప‌రిధిలో ఉంద‌ని, దాని విడుద‌ల‌పై తుది నిర్ణ‌యం సుప్రీం, సెన్సార్ ల‌దేన‌ని అన్నాడు. అయినా, సినిమా చూడ‌కుండానే దానిపై వివాదాలు చేయ‌డం, నిషేధం విధించ‌డం త‌గ‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. సుప్రీం కోర్టు, సెన్సార్ ఆదేశాలను ప్ర‌తి ఒక్క‌రూ పాటించాల్సిందేన‌న్నారు.

సల్మాన్‌ ఖాన్‌, భన్సాలీల‌ కాంబినేషన్లో వ‌చ్చిన ‘ఖామోషీ’, ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ చిత్రాల త‌ర్వాత భ‌న్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన `దేవ‌దాసు` చిత్రంలో స‌ల్లూ భాయ్ న‌టిస్తాడ‌ని, వారిద్ద‌రూ హ్యాట్రిక్ హిట్ కొడ‌తార‌ని అంతా అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆ చిత్ర హీరోగా షారుక్ ను భ‌న్సాలీ ఎంచుకున్నాడు. ఆ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని టాక్ వ‌చ్చింది. ఓ నటుడిగా స‌ల్మాన్ ను తాను తక్కువ చేయలేద‌ని, ఆ పాత్ర‌కు షారుక్ అయితే క‌రెక్ట‌ని భావించ‌డం వ‌ల్లే అలా చేశాన‌ని భ‌న్సాలీ వివ‌ర‌ణ ఇచ్చాడు. ఈ నేప‌థ్యంలో తాజా ఇంట‌ర్వ్యూలో.... ప‌ద్మావ‌తి చిత్రంతో  భన్సాలీ చాలా మందిని బాధించారన్న‌ ఆరోపణల‌పై స‌ల్మాన్ స్పందనను మీడియా ప్ర‌తినిధులు అడిగారు.  దానికి స‌ల్లూ భాయ్ త‌న‌దైన హాస్య చ‌తుర‌త‌ను జోడించి స‌ర‌దాగా స‌మాధాన‌మిచ్చాడు. ‘మిగిలిన వారి గురించి నాకు తెలియదు. కానీ, నేను మాత్రం ఆయన వల్ల చాలా బాధపడ్డా. నేను ఆయనకు రెండు సూపర్‌హిట్స్‌ ఇచ్చా. కానీ ఆయన తన తర్వాతి చిత్రానికి షారుక్‌ ఖాన్ ను తీసుకున్నారు’ అంటూ సల్మాన్ చ‌మ‌త్కార ధోర‌ణిలో స‌మాధాన‌మివ్వ‌డంతో అక్క‌డున్న మీడియా ప్ర‌తినిధులంతా ఘొల్లున న‌వ్వారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు