అమ్మ స్థానం కోసం బ‌రిలోకి అగ్ర‌హీరో..?

అమ్మ స్థానం కోసం బ‌రిలోకి అగ్ర‌హీరో..?

సంచ‌ల‌నాల రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తోంది త‌మిళ‌నాడు రాష్ట్రం. అమ్మ అనారోగ్యంతో మొద‌లైన త‌మిళ‌నాడు రాజ‌కీయ అనిశ్చితి ఆమె మ‌ర‌ణంతో మ‌రింతగా ముదిరింది. ఆమె మ‌ర‌ణించి నెల‌లు గ‌డుస్తున్నా.. రాజ‌కీయ అనిశ్చితి ఒక కొలిక్కి రావ‌టం లేదు. ఇదిలా ఉంటే.. అమ్మ మ‌ర‌ణం నేప‌థ్యంలో ఆర్కే న‌గ‌ర్‌కు ఉప ఎన్నికను నిర్వ‌హిస్తున్నారు.

గ‌తంలో ఒక‌సారి ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ చేసి మ‌రీ నిలిపివేసిన ఈసీ.. ఈ మ‌ధ్య‌నే మ‌రోసారి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. ఇదిలాఉంటే.. ఈ ఉప ఎన్నిక‌ల బ‌రిలో సంచ‌ల‌నం చోటు చేసుకోనున్న‌ట్లుగా చెబుతున్నారు. త‌మిళ యువ న‌టుడు విశాల్ రెడ్డి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌న్న మాట త‌మిళ మీడియాలో బ‌లంగా వినిపిస్తోంది.

ఇప్ప‌టికే ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాల‌తో పాటు..  ఆ మ‌ధ్య‌న భారీ వ‌ర్షాల‌తో చెన్నై మ‌హాన‌గ‌రం వ‌ణికిన‌ప్పుడు త‌న స్టార్ డ‌మ్ ను ప‌క్క‌న పెట్టేసి విశాల్ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు.. సేవ అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించాయి. యాక్ష‌న్ చిత్రాల హీరోగా సుప‌రిచితుడైన విశాల్ ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల బ‌రిలోక  దిగితే.. ఉప ఎన్నిక సీన్ మొత్తం మారిపోతుంద‌ని చెప్పాలి. అయితే.. విశాల్ పోటీ మీద మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ విశాల్ నుంచి రాలేదు.

ఓప‌క్క క‌మ‌ల్ త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం గురించి ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేయ‌టం.. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్న వేళ‌.. అనూహ్యంగా విశాల్ సైతం రాజ‌కీయాల్లోకి రానున్నార‌న్న మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త‌మిళ మీడియా వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం 2021లో జ‌రిగే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాడులోని 234 అసెంబ్లీ స్థానా ల‌నుంచి పోటీ చేస్తార‌న్న మాట వినిపిస్తోంది. ఆలూలేదు చూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్న చందంగా.. రాజ‌కీయాల్లోకి వ‌స్తారో?  రారో? అన్న క్లారిటీ లేకుండా 2012 వ‌ర‌కూ విశ్లేష‌కులు వెళ్లివ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English