విశ్వరూపం-2లో కమల్ ఇలా ఉంటాడు..

 విశ్వరూపం-2లో కమల్ ఇలా ఉంటాడు..

మూడేళ్లకు పైగా మరుగున పడి ఉన్న ‘విశ్వరూపం-2’ను కొన్ని నెలల కిందటే బయటికి తీశాడు కమల్ హాసన్. చెన్నైలో ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. ఇప్పుడు సినిమాలో బ్యాలెన్స్ ఉన్న సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తి చేసే పనిలో పడ్డాడు కమల్. చెన్నై శివార్లలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.

ఆ సందర్భంగా తీసిన ఆన్ లొకేషన్ ఫొటోల్ని కూడా కమల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘విశ్వరూపం’లో కీలక పాత్ర చేసిన ఆండ్రియా జెరెమీ ఈ చిత్రంలోనూ కొనసాగనుంది. ఇప్పుడు కమల్ ఆమెతో కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరూ మిలిటరీ డ్రెస్సులో ఉన్నారు. ఆండ్రియా షార్ట్ కటింగ్‌తో కనిపిస్తోంది. కమల్ ‘విశ్వరూపం’లా మాదిరి స్లిమ్ లుక్‌లో లేడు. ఆయన లుక్ కొంచెం తేడాగానే కనిపిస్తోంది.

సినిమాలోని మిగతా సన్నివేశాలన్నీ మూడేళ్ల ముందు తీసినవి. మరి ఈ చివరి షెడ్యూల్ సీన్లలో అందరి లుక్స్ మారిపోయి ఉంటాయి కాబట్టి సినిమాలో అవి ఎలా సింక్ అవుతాయో చూడాలి. 2013 ఆరంభంలో వచ్చిన ‘విశ్వరూపం’ అప్పట్లో సెన్సేషనల్ హిట్టయింది. దర్శకుడిగా కమల్‌కు ఇదే తొలి విజయం. ‘విశ్వరూపం-2’ను వచ్చే ఏడాది జనవరి 26న రిలీజ్ చేయడానికి కమల్ సన్నాహాలు చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు