హలో.. మ్యాటరుంటే ఇవన్నీ అక్కర్లే

హలో.. మ్యాటరుంటే ఇవన్నీ అక్కర్లే

అఖిల్ సెకండ్ మూవీ హలో పై ఇండస్ట్రీలోనే కాదు.. జనాల్లో కూడా చాలానే బజ్ ఉంది. అఖిల్ రీలాంఛింగ్ అంటూ నాగార్జున చెప్పడం.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన మూవీ కావడం.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రం కావడంతో.. అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

మరోవైపు ప్రమోషన్స్ ను కూడా భారీగానే ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు యూఎస్ మార్కెట్ లో కూడా హలోకు భారీ రెస్పాన్స్ రప్పించడానికి.. అక్కడ లైవ్ కాన్సర్ట్ లు ప్లాన్ చేశారు. 3 సిటీస్ లో ఫ్రీ ఎంట్రీతో లైవ్ కాన్సర్ట్ లను ఏర్పాటు చేశారు.

వీటిలో హలో మూవీ హీరో హీరోయిన్స్ అయిన అఖిల్- కళ్యాణిలతో పాటు.. నిర్మాత నాగార్జున కూడా పెర్ఫామ్ చేయడమే కాకుండా.. బాహుబలి స్టార్ అయిన దగ్గుబాటి రానాతో కూడా లైవ్ పెర్ఫామెన్స్ ఇప్పిస్తున్నారు. నిజానికి సినిమాలో కంటెంట్ ఉంటే ఈ టూర్లన్నీ అక్కర్లేదు. నాగార్జున కంటెంట్ విషయంలో జాగ్రత్త పడతారనే సంగతి తెలిసిందే.

కానీ ఇప్పుడు మరీ ఇలా శృతి మించిన ప్రచారం కారణంగా.. 'అఖిల్' తరహాలో రాంగ్ హైప్ క్రియేట్ అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. టీజర్ తో కాన్సెప్ట్ వరకూ చూచాయగా చెప్పేసిన తర్వాత.. మరీ ఇంతగా అతి ప్రచారం చేస్తే.. మొత్తానికే ప్రమాదం వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఎన్ని రకాల ప్రచారాలు చేసినా.. చివరకు మూవీలో కంటెంట్ మాత్రమే మ్యాటర్ అవుతుంది కదా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు