మొదలే ఇప్పుడు.. అవన్నీ హంబక్కే

మొదలే ఇప్పుడు.. అవన్నీ హంబక్కే

గత తరం అందాల తార శ్రీదేవి తన కూతురు జాన్వి కపూర్ ను హీరోయిన్ గా పరిచయం చేసేందుకు బోలెడంత ప్లానింగ్ వేసుకున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు మరాఠీ మూవీ సైరత్ రీమేక్ లో జాన్వి హీరోయిన్ గా.. ఇషాన్ ఖట్టర్ హీరోగా మూవీ ఖాయం అయింది.

కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రం టైటిల్ ప్రకటించేసి పోస్టర్స్ కూడా ఇచ్చారు. ధడఖ్ అనే పేరుపై ఈ చిత్రం రూపొందనుండగా.. పోస్టర్స్ లో హీరో హీరోయిన్స్ ఇద్దరూ సూపర్బ్ గా ఉన్నారనే టాక్ వచ్చింది. శ్రీదేవిని దింపేసిందని జాన్వి పొగడ్తలు కూడా అందుకుంది. జాన్వి కపూర్ అద్భుతంగా చేస్తోంది.. పాటల్లో డ్యాన్సులు.. సీన్లలో హావభావాలు.. అన్నీ అమ్మ శ్రీదేవి మాదిరిగానే ఉన్నాయంటూ బాలీవుడ్ లో బోలెడు కథలు చెప్పారు.

పోస్టర్లతోనే శ్రీదేవి కూతురు ఇరగదీసేసింది అని కూడా పొగడ్తలు గుప్పించారు. వాస్తవానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. అసలు ఈ ధడఖ్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది ఇవాళే. అంటే డిసెంబర్ 1 ఉదయం గణేషుడు.. వెంకటేశ్వర స్వామి ఫోటోలకు పూజలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించారు.

అంటే ఇంతకు ముందు వచ్చిన పోస్టర్స్ అన్నీ ఒట్టి హంబక్ అనే సంగతి అర్ధమైపోతోంది. షూటింగ్ కి ముందు టెస్ట్ షూట్ లు.. ఫోటో షూట్స్ చేస్తారు. ఆ ఫోటోలనే ఉపయోగించేసి.. ఫస్ట్ లుక్ పోస్టర్ల రేంజ్ లో రిలీజ్ చేశారంతే. అసలు షూటింగ్ ఈరోజే మొదలైంది. ఏదేమైనా కూడా బాలీవుడ్డోళ్ళ హంగామా బాగా ఓవరండీ బాబూ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు