అనుష్కకు ఆ స్టార్ హీరో ఛాన్స్

అనుష్కకు ఆ స్టార్ హీరో ఛాన్స్

గతంతో పోలిస్తే అనుష్క హవా తగ్గిందన్న మాట వాస్తవం. వయసు ఎక్కువైపోవడం వల్ల కావచ్చు.. ‘సైజ్ జీరో’ సినిమా వల్ల షేపవుట్ కావడం వల్ల కావచ్చు.. అనుష్కకు ఇంతకముందున్నంత డిమాండ్ కనిపించడం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె కనిపించి చాన్నాళ్లయింది.

ఐతే ఈ మధ్య బరువు తగ్గి మళ్లీ పాత షేపుల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్న అనుష్కకు నెమ్మదిగా అవకాశాలు వస్తున్నట్లే కనిపిస్తోంది. అక్కినేని నాగార్జున-రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో అనుష్కే కథానాయిక అన్న వార్తలొస్తుండగా.. ఇప్పుడు మరో పెద్ద సినిమాలో ఆమె కథానాయికగా కన్ఫమ్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

తమిళ స్టార్ అజిత్ హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వాసం’లో అనుష్కనే కథానాయికగా ఫైనలైజ్ చేశారట. వీరం, వేదాళం, వివేగం సినిమాల తర్వాత శివ దర్శకత్వంలో మరోసారి అజిత్ హీరోగా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో అనుష్కే హీరోయిన్ అట. అజిత్-అనుష్క కలిసి ఇంతకుముందు ‘ఎన్నై అరిందాల్’ సినిమాలో నటించారు.

ఐతే అందులో ఇద్దరి మధ్య పెద్దగా కెమిస్ట్రీ ఉండదు. త్రిషనే ఆ చిత్రంలో లీడ్ హీరోయిన్‌గా నటించింది. ‘విశ్వాసం’లో మాత్రం అనుష్కే ప్రధాన కథానాయిక అట. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్ అని అంటున్నారు. ‘వివేగం’ ఫ్లాప్ అయినప్పటికీ శివ మీద భరోసాతో మరోసారి అతడితో సినిమా చేస్తున్నాడు అజిత్. ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం నిర్మించనున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు