మెర్శల్ సినిమాకు 60 కోట్ల నష్టమా?

మెర్శల్ సినిమాకు 60 కోట్ల నష్టమా?

‘మెర్శల్’ సినిమా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ చిత్రానికి రూ.60 కోట్ల నష్టం వచ్చిందంటూ సీనియర్ నటుడు, రచయిత ఎస్ఈ శేఖర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తమిళ సినిమాల్లో ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోయిందని.. ‘మెర్శల్’ సినిమాకు కూడా భారీగా ఖర్చు పెట్టించారని.. ఈ సినిమా వల్ల అందరూ సొమ్ము చేసుకున్నారని.. కానీ నిర్మాత మాత్రం రూ.60 కోట్ల దాకా నష్టపోయాడని.. ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని శేఖర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడం కోలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ చిత్ర దర్శకుడు అట్లీ గత సినిమాకు రూ.3 కోట్ల పారితోషకం తీసుకున్నాడని.. కానీ ‘మెర్శల్’కు మాత్రం అతను రూ.13 కోట్లు పుచ్చుకున్నాడని ఆయన అన్నారు. ఐతే ఈ ఏడాది తమిళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ‘మెర్శల్’ గురించి శేఖర్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. చాలాచోట్ల కబాలి, నాన్-బాహుబలి కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టిన సినిమాకు రూ.60 కోట్ల నష్టం రావడమేంటని ఇండస్ట్రీ జనాలు ప్రశ్నిస్తున్నారు.

దీనిపై ట్రేడ్ అనలిస్టులు.. డిస్ట్రిబ్యూటర్లు స్పందించారు. నిర్మాతతో పాటు ఈ చిత్రంపై పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరూ లాభాలు అందుకున్నారని.. శేఖర్ దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

ఈ విషయంలో అజిత్ మద్దతుదారుల ప్రమేయం ఉందని.. ‘మెర్శల్’ సాధించిన విజయాన్ని ఓర్వలేక కావాలనే ఇలా దుష్ప్రచారం చేయిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘మెర్శల్’ నిర్మాత ఓ ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English