అనుష్కది ఆల్‌మోస్ట్‌ మహేష్‌బాబు రేంజ్‌!

అనుష్కది ఆల్‌మోస్ట్‌ మహేష్‌బాబు రేంజ్‌!

మహేష్‌బాబుకి మురుగదాస్‌లాంటి స్టార్‌ డైరెక్టర్‌ తోడయితే స్పైడర్‌ రైట్స్‌ తమిళంలో పద్ధెనిమిది కోట్లు పలికాయి. అలాంటిది తమిళ వారికి కనీసం పేరు కూడా తెలియని దర్శకుడితో అనుష్క చేస్తోన్న లేడీ ఓరియెంటెడ్‌ థ్రిల్లర్‌ చిత్రం భాగమతికి తమిళంలో పదిహేను కోట్లు పలికాయి. అనుష్క ఆల్రెడీ తమిళంలో పేరున్న నటి అయినా కానీ స్టార్‌ హీరో లేకుండా ఆమె తమిళ చిత్రాలేమీ ఆడిన దాఖలాలు లేవు.

బాహుబలి ఎఫెక్ట్‌ వల్ల భాగమతి చిత్రానికి కూడా క్రేజ్‌ వుంటుందనే అంచనాతో ఇంత రేట్‌ ఇచ్చేసారట. తెలుగులో కూడా భాగమతి బిజినెస్‌ జోరుగా జరుగుతోంది. బయ్యర్ల కోరిక మేరకు సంక్రాంతి బరినుంచి తప్పించి జనవరి 26న రిలీజ్‌ చేస్తున్నారు. తమిళంలో ఈ చిత్రానికి పదిహేను కోట్లు రావడం అంతటా హాట్‌ టాపిక్‌ అయింది.

తమిళంలో టాప్‌ హీరోయిన్‌గా వెలుగుతోన్న నయనతార చిత్రాలు కూడా ఎప్పుడూ ఈ రేట్‌కి అమ్ముడు కాలేదట. ఈ చిత్రం చాలా వెరైటీగా కనిపిస్తూ వుండడం, ఫస్ట్‌ లుక్‌తోనే బెస్ట్‌ మార్కులు కొట్టేసి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో ఇలా ఈ చిత్రానికి క్రేజ్‌ ఏర్పడిందని అంటున్నారు.

మహేష్‌, మురుగదాస్‌ కలిసినా కూడా స్పైడర్‌కి తమిళంలో పది కోట్లు రాలలేదు. మరి సింగిల్‌ హ్యాండెడ్‌గా అనుష్క ఈ చిత్రం కొన్న వారిని ఒడ్డున పడేస్తుందా లేదా అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు