పవన్‌కళ్యాణ్‌తో అందరూ ఇన్‌ అండ్‌ అవుట్‌!

పవన్‌కళ్యాణ్‌తో అందరూ ఇన్‌ అండ్‌ అవుట్‌!

పవన్‌కళ్యాణ్‌ పర్సనల్‌ వ్యవహారాలు చూసుకోవడానికి, అతని సినిమాలకి సంబంధించిన పనులు చక్కబెట్టడానికి ఎప్పుడూ ఎవరో ఒకరు వుంటూ వుంటారు. అయితే మిగతా హీరోలకి వున్నట్టుగా ఒకరే వ్యక్తి ఎక్కువ కాలం పాటు పవన్‌ విషయాలు చక్కబెట్టడు. కనీసం మూడేళ్లకి ఓసారి అయినా పవన్‌ దగ్గర ఆంతరంగిక వ్యక్తులు మారుతుంటారు. నర్రా శ్రీనులాంటి వాళ్లు అలా అంటిపెట్టుకుపోయినా కానీ వారికి అఫీషియల్‌ వ్యవహారాలు అప్పగించడు.

పవన్‌ దగ్గర ఒకే వ్యక్తి ఎక్కువ కాలం పాటు అన్ని విషయాలు చక్కబెట్టడం లేదు కనుకే పవన్‌ని కాంటాక్ట్‌ చేయడం మీడియాకే కాక ఫాన్స్‌కి కూడా తలకి మించిన భారం అయిపోతోంది. మొన్నటి వరకు పవన్‌ని కాంటాక్ట్‌ చేయాలంటే శరత్‌ మరార్‌ ద్వారా వెళ్లేవారు. కానీ ఇప్పుడాయన పవన్‌ దగ్గర లేడు. వరుసగా మూడు సినిమాలకి శరత్‌కి చేసిపెట్టిన పవన్‌ ఇప్పుడు తన అఫీషియల్‌ వ్యవహారాలు చక్కబెట్టే వ్యక్తి లేకుండానే గడిపేస్తున్నాడు.

ప్రస్తుతం పవన్‌ని కాంటాక్ట్‌ చేయాలంటే వున్న ఏకైక ఛానల్‌ త్రివిక్రమ్‌. అతనే అందరికీ దొరికే వ్యక్తి కాకపోవడంతో ఇక పవన్‌ని కలుసుకోవడం ఎవరికీ కుదరడం లేదట. ఈమధ్య సోషల్‌ ఇష్యూస్‌లో కూడా పవన్‌ కనిపించకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు.

పవన్‌తో ఏళ్ల తరబడి అనుబంధం వున్న అభిమానులు కూడా ఇప్పుడు పవర్‌స్టార్‌ని కలవలేకపోతున్నారు. త్వరగా అందరికీ అందుబాటులో వుండే వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తాడని వారంతా ఎదురు చూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు