మారవయ్యా నానీ.. మారు!!

మారవయ్యా నానీ.. మారు!!

ప్రస్తుతం నాని ఓ స్టార్ హీరో అనడంలో తప్పేమీ లేదు. యావరేజ్ కంటెంట్ తో అయినా.. వరుస సక్సెస్ లు సాధించడంలో సక్సెస్ అవుతున్నాడు నాని. ఆయా సినిమాల్లో నాని ఉన్నాడనే కాన్సెప్ట్ తోనే జనాలు థియేటర్లకు వచ్చారు.. అంతో ఇంతో వినోదం ఉండడం మెచ్చారు. కానీ ఇదే ఎల్లకాలం నడిచిపోతుందని న్యాచురల్ స్టార్ అనుకుంటున్నాడా అనిపించక మానదు.

క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ మూడు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. నాని నటించిన ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయి.. అల్లు శిరీష్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఒక్క క్షణం.. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో చిత్రాలు వస్తున్నాయి. వీఐ ఆనంద్ ట్రాక్ రికార్డ్.. టైటిల్ ప్రకారం చూస్తే.. ఇది కచ్చితంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న థ్రిల్లర్ అనే విషయం తెలిసిపోతోంది. విక్రమ్ కె కుమార్ అయితే.. ఇప్పటివరకూ ప్రతీ మూవీతోనూ కొత్త జోనర్ ను టచ్ చేస్తూ దూసుకుపోతున్న వైనం తెలుస్తోంది. అంటే కచ్చితంగా ఒక్క క్షణం.. హలో చిత్రాలు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వస్తున్నవే.

కానీ నాని మాత్రం మళ్లీ ఓ లవ్ స్టోరీ.. కాసిన్ని మాస్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి రొటీన్ గానే తనకు అలవాటైన జోనర్ తోనే వస్తున్నాడు. చిన్నచిన్న కుర్రాళ్ళు కొత్త కాన్సెప్టులతో వస్తుంటే.. నాని మాత్రం రొటీన్ సినిమాలతో కామెడీ చేస్తూ కాలం వెళ్లబుచ్చాలని చూస్తున్నాడు. ఇప్పటివరకూ సంగతేమో కానీ.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ కి జనాలు బ్రహ్మరథం పడుతున్న తరుణంలో.. ఇకమీదట కూడా నాని రొటీన్ సినిమాలతో సక్సెస్ లు సాధించడం అంత తేలికేమీ కాదని.. ఒక దెబ్బ తగిలితే కోలుకోవడం కష్టమవుతుందని చాలామంది వాదన. అందుకే కథలు ఎంచుకోవడంలో నానిలో మార్పు రావాల్సిన అవసరం ఉందనే సూచనలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English