‘జవాన్’కు జరిగిన రిపేర్లపై దిల్ రాజు..

‘జవాన్’కు జరిగిన రిపేర్లపై దిల్ రాజు..

సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ‘జవాన్’ ఎప్పుడో ఆగస్టులో రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడు డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. చెప్పిన రిలీజ్ డేట్ కంటే రెండు మూడు వారాలు లేటవ్వడం మామూలే అనుకోవచ్చు. కానీ ఏకంగా నాలుగు నెలలు ఆలస్యంగా సినిమా రిలీజైతే రకరకాల సందేహాలు కలుగుతాయి.

ఈ సినిమా ఔట్ పుట్ సరిగా రాకపోవడంతో స్క్రిప్టును మళ్లీ మార్చి.. రీషూట్లు చేశారంటూ రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఈ విషయమై ఈ చిత్ర సమర్పకుడు దిల్ రాజు ఓపెన్ అయ్యాడు. ఈ చిత్రానికి రీషూట్లు జరిగిన మాట వాస్తవమే అని అంగీకరించాడు. దీనిపై ఆయన ఇంకా ఏమన్నాడంటే..

‘‘నేను అనుకోకుండా ఈ ప్రాజెక్టులోకి వచ్చాను. హరీష్ శంకర్.. కృష్ణతో కలిసి ఈ సినిమాను నిర్మించాల్సింది. కానీ హరీష్‌కు ‘డీజే’ ఓకే కావడంతో అతను తప్పుకుని నన్ను ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చాడు. కథ నచ్చి సినిమా చేయడానికి అంగీకరించాను. ఐతే సినిమా పూర్తయి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాక ఔట్ పుట్ చూసుకుంటే 100 శాతం సంతృప్తిగా అనిపించలేదు. కథగా విన్నపుడు బాగున్నా.. సినిమా చూసుకున్నపుడు ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. అందుకే మళ్లీ అందరం కలిసి కూర్చుని మాట్లాడుకున్నాం. రైటర్లతో మాట్లాడి మార్పులు చేయించాం. మళ్లీ కొన్ని సన్నివేశాలు రీషూట్ చేశాం. ఇది నా పద్ధతి. నేను ముందు నుంచి ఇలాగే సాగుతున్నా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా తీరు ఇలాగే ఉంటుంది. మనకు ఆరోగ్యం బాలేనపుడు చికిత్స చేయించుకుని రెడీ అయి మళ్లీ పనిలో పడ్డట్లుగా సినిమా విషయంలో కూడా ఏవైనా తేడాలొస్తే మార్పులు చేర్పులు చేయాలి. అందులో తప్పేమీ లేదు. ఈ విషయంలో నన్ను భరించిన ‘జవాన్’ రైటర్లకు థ్యాంక్స్’. మొన్న ఫస్ట్ కాపీ చూసుకుంటే ఇది సూపర్ హిట్టవడం గ్యారెంటీ అనిపించింది’’ అని రాజు చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు