పొగడమంటే.. మెగా ఫ్యామిలీలో ఫిట్టింగ్ పెట్టాడు

పొగడమంటే.. మెగా ఫ్యామిలీలో ఫిట్టింగ్ పెట్టాడు

సినిమా ఫంక్షన్స్ లో పొగడ్తలు ఈ మధ్య మరీ శృతి మించిపోతున్నాయి. ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా తయారైంది వ్యవహారం. ఆఖరికి దర్శకేంద్రుడు లాంటి దిగ్గజం కూడా నోటికొచ్చినట్లు మాట్లాడేయడం.. ఎక్స్ ట్రీమ్ రేంజ్ లో ప్రశంసలు కురిపించేయడం ఆశ్చర్యకరం.

సాయి ధరం తేజ్ నటించిన జవాన్ మూవీకి రీసెంట్ గా ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శక దిగ్గజం కె. రాఘవేంద్రరావు కూడా హాజరయ్యారు. ఇంటికొకడు ఇలాంటి వ్యక్తి ఉంటే దేశం బాగుపడుతుందనే మెసేజ్ తో రూపొందిన ఈ సినిమా.. సక్సెస్ అవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది కానీ.. 'మెగాస్టార్ లో ఉన్న గ్రేస్.. సాయిధరంతేజ్ లో కనిపిస్తోంది. యాక్టింగ్.. డ్యాన్స్.. ఫైట్స్.. డైలాగ్ డెలివరీ అన్నిటిలోనూ సూపర్ గా చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీలో మరో మెగాస్టార్ తేజ్' అని రాఘవేంద్రరావు అనడం బాగా అతిశయోక్తిగా చెబుతున్నారు సినీ జనాలు.

మెగాస్టార్ తర్వాత ఆ స్థానం రామ్ చరణ్ దే అని మెగా ఫ్యాన్స్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ స్థాయిని కూడా అంచనా వేయడం కష్టం. అల్లు అర్జున్ కూడా తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నాడు. పైగా మెగాస్టార్ కూడా రీఎంట్రీతో ఇరగదీసేస్తున్నారు. ఒక కుటుంబంలో ఇంతమంది స్టార్స్ ఉండడం ఆశ్చర్యకరమే. అలాగని తేజు ట్యాలెంట్ ను తక్కువగా చూడకపోయినా.. ఏకంగా మెగాస్టార్ అనేయడం మాత్రం బాగా ఎక్కువే అనేది మెగా ఫ్యాన్స్ ఫీలింగ్. అయినా రెండు మంచి మాటలు చెబుతారని రాఘవేంద్రరావును పిలిస్తే.. ఆయనిలా ఫిటింగ్ పెట్టడం ఏంటనేది అభిమానుల వాదన.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు