హీరోయిన్స్ లా తయారైన కుర్ర హీరో

హీరోయిన్స్ లా తయారైన కుర్ర హీరో

యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ పరిస్థితి ఇంకా అటూ ఇటూగానే ఉంది. ఆరంభంలో వచ్చిన సక్సెస్ లకు తగినట్లుగా రేంజ్ ను పెంచుకోవడంలో విఫలమయ్యాడు ఈ యంగ్ హీరో. వరుస ఫ్లాపులు సందీప్ కిషన్ ను బాగానే ఇబ్బంది పెట్టాయి.

సహజంగా ఇన్నేసి ఫ్లాపులు వస్తే తర్వాతి అవకాశాలు అందడం ఆలస్యం అవుతుంటుంది. కొత్త సినిమాలను పట్టుకోవడం కష్టంగా కూడా మారుతుంది. కానీ సందీప్ కిషన్ విషయంలో మాత్రం ఇలా జరగడం లేదు. తెలుగులో సినిమాలు లేకపోతే.. తమిళ్ లో వరుస సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా కేరాఫ్ సూర్య.. అరవింద్ స్వామితో కలిసి నరగసూరన్.. జాకీష్రాఫ్ విలన్ గా నటిస్తున్న ప్రాజెక్ట్ జెడ్.. ఇలా వరుస సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. సహజంగా ఇలాంటి ట్రెండ్ హీరోయిన్స్ లో కనిపిస్తుంది. అప్పట్లో తాప్సీ పన్ను.. తర్వాత రకుల్ ప్రీత్ సింగ్.. రెజీనా కసాండ్రా లాంటి వారు కూడా ఫ్లాపులు వచ్చినా వరుసగా మూవీస్ అందుకుని ఆశ్చర్యపరిచారు.

ఇప్పుడు సందీప్ కిషన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒక అమ్మాయి తప్ప.. మా నగరం.. నక్షత్రం ఫ్లాపులే. రీసెంట్ గా కేరాఫ్ సూర్యను అయితే మళ్లీ రిలీజ్ చేస్తామని థియేటర్ల లోంచి తీసేశారు. అయినా సరే.. ఇతడి చేతిలో ఇంకా చాలానే ప్రాజెక్టులు ఉున్నాయి. ఏదో ప్రాజెక్టులో ఛాన్స్ సంపాదించడం.. పక్క భాషలో అవకాశాలు పట్టుకోవడం లాంటి హీరోయిన్స్ టెక్నిక్స్ ను సందీప్ కిషన్ పట్టేశాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు