అతను తప్పుకోలే... చిరంజీవే తీసేసాడు!

అతను తప్పుకోలే... చిరంజీవే తీసేసాడు!

సైరా నరసింహారెడ్డి చిత్రం నుంచి పెద్ద టెక్నీషియన్లు ఒక్కొక్కరే తప్పుకుంటూ వుండడంతో కళ తప్పుతోంది. డైరెక్టర్‌గా సురేందర్‌కి ఇంతటి భారీ చిత్రాన్ని హ్యాండిల్‌ చేసిన అనుభవం లేకపోయినప్పటికీ సాంకేతిక నిపుణులు అందరినీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారినే పెట్టుకోవాలని అనుకున్నారు. ముందుగా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా అనుకున్న రవి వర్మన్‌ తప్పుకున్నాడు. ఆ స్థానంలో రత్నవేలుని తీసుకుని వెంటనే లోటు భర్తీ చేసారు.

ఇప్పుడు రెహమాన్‌ కూడా తప్పుకోవడంతో ఎందుకని అంతా వెళ్లిపోతున్నారనేది మీడియాలో హాట్‌ టాపిక్‌ అయింది. చిరంజీవి తన అభిమాన నటుడు అయినా కానీ ఈ చిత్రం చేయలేకపోతున్నందుకు రెహమాన్‌ విచారం వ్యక్తం చేసాడు. ఇంతకీ అసలు తెరవెనుక ఏం జరిగింది? ఈ చిత్రానికి సంగీతానికే పది కోట్ల రూపాయలని రెహమాన్‌ డిమాండ్‌ చేసాడట. హిందీ, తమిళ భాషల్లో కూడా సినిమా రిలీజ్‌ అవుతుంది కనుక, అక్కడ మార్కెటింగ్‌కి తన పేరు హెల్ప్‌ అవుతుంది కనుక అంత మొత్తం కావాలని అడిగాడట.

చేసేది ఒక్క సినిమా పని అయినపుడు మూడు వెర్షన్లకి కలిపి రేటు మాట్లాడ్డమేంటని చిరంజీవి అభ్యంతరం చెప్పారట. అలా ఇరు వర్గాలకీ రేటు విషయంలో పేచీ వచ్చి రెహమాన్‌ తప్పుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అతని స్థానంలో మరో పెద్ద సంగీత దర్శకుడిని పెట్టాలని చిరంజీవి భావిస్తోంటే సురేందర్‌ మాత్రం తమన్‌ అయితే మంచి ఆప్షన్‌ అని అంటున్నాడట. మరి చివరకు సైరా కోసం సై అనే ఆ సంగీతకారుడు ఎవరో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు