ఆ డిజె భజానాలో.. రాక్షసి మిసమిసలు

ఆ డిజె భజానాలో.. రాక్షసి మిసమిసలు

ఈ మధ్యన మన హీరోలు హీరోయిన్లు అసలు సంగీత విభావరి అంటే చాలు.. అక్కడ తెగ కనిపించేస్తున్నారు. గత ఏడాది బెల్జియంలో జరిగిన ఒక మ్యూజిక్ ఫెస్టివల్లో నాగచైతన్య.. సమంత.. రానా.. రకుల్.. రెజీనా.. తదితరులు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత గోవాలో సన్ బర్న్ ఫెస్టివల్ లో మెగా ఫ్యామిలీ హీరోలంతా సందడి చేశారు. అలాగే ఇళయరాజా కాన్సర్ట్ లో..రెహ్మాన్ సంగీత విభావరిలో కూడా మన హీరోలు హీరోయిన్లు హడావుడి చేశారు.

ఇకపోతే కేవలం ఏదో వెళ్ళడం కాదు.. అక్కడ తమ న్యాచురల్ బ్యూటీని కాస్త సెక్సీగా ఆరబోయడమే పనిగా పెట్టుకున్నారు మన స్టారీమణులు. బెల్జియంలో జరిగిన టుమారోల్యాండ్ కాన్సర్ట్ లో సమంత అయితే ఏకంగా బ్రాలెట్ వేసుకుని దానిపై ఒక కోటు ధరించి.. తన నాభి అందాలను ఆరబోతలో పెట్టింది. అలాగే ఇప్పుడు గత రాత్రి ముంబయ్ లో జరిగిన డిజె కైగో గానాభజానాకు వెళ్లారు కొందరు టాలీవుడ్ స్టార్లు. వారిలో వరుణ్‌ తేజ్.. రాశి ఖన్నా.. లావణ్య త్రిపాఠి ఉన్నారు. అందులో అందాల రాక్షసి లావణ్యను చూస్తే.. అమ్మడు మెరుపులు మెరిపించే క్రాప్ టాపులో తన నాభి సోయగాల మిసమిసలను దారబోసింది.

డిజె కైగో వరల్డ్ వైడ్ బాగా పాపులర్ అయిన ఒక డిస్క్ జాకీ. మనోడు ఎడ్ షీరన్ వంటి అంతర్జాతీయ సింగర్ల పాటలను రీమిక్స్ చేసి చాలా పేరుప్రఖ్యాతులు గడించాడు. నార్వేకు చెందిన ఈ డిజె ఇప్పుడు భారత్ లో గత మూడు రోజులుగా లైవ్ షోలు నిర్వహిస్తున్నాడు. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు