షారుక్‌ షో లో దీపిక కంట‌త‌డి...ఫొటోలు వైర‌ల్!

షారుక్‌ షో లో దీపిక కంట‌త‌డి...ఫొటోలు వైర‌ల్!

బాలీవుడ్ బాద్షాహ్ షారుక్ ఖాన్ స‌ర‌స‌న `ఓం శాంతి ఓం` సినిమాతో తెరంగేట్రం చేసిన దీపికా ప‌దుకొనే ఆ త‌ర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ త‌ర్వాత  వీరిద్ద‌రూ క‌లిసి ‘బిల్లు’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘హ్యాపీ న్యూఇయర్‌’ చిత్రాల్లో నటించారు. తాజాగా వీరిద్ద‌రూ ఓ టీవీ షో లో క‌నిపించ‌బోతున్నారు. ఈ శ‌నివారం నుంచి స్టార్ ప్ల‌స్ లో ప్ర‌సారం కాబోతోన్న ‘బాతే విత్‌ ద బాద్‌షా’ అనే షోకు కింగ్ ఖాన్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ షో తొలి ఎపిసోడ్ లో అతిథిగా దీపికా పాల్గొని సంద‌డి చేసింది. ఈ సంద‌ర్భంగా త‌న తొలి సినిమా హీరోతో దీపికా అనేక ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది. `ప‌ద్మావ‌తి` వివాదం పై కూడా దీపికా స్పందించింది.  

ఆ షో సందర్భంగా దీపిక తల్లి ఉజ్జలా పదుకొణె....దీపిక‌ను ఉద్దేశించి రాసిన లేఖను షారుక్‌ చదివారు. తన కుమార్తెపై ప్రేమను తెలియ‌జేస్తున్న ఆ లేఖను విన్న దీపిక భావోద్వేగంతో కంట‌త‌డి పెట్టింది. దీపిక దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోన్న ‘పద్మావతి’  వివాదంపై కూడా దీపికా స్పందించింది.  తనపై వెల్లువెత్తుతున్న విమర్శలపై స‌మాధాన‌మిచ్చింది. ప్ర‌తిసారి విమర్శల నుంచి కొత్త విషయాల్ని నేర్చుకుంటుంటాన‌ని, మానసికంగా పరిణతి చెందిన భావన కలుగుతుంద‌ని దీపిక‌ చెప్పింది. ప్రజలు త‌న‌ను ఏయే విషయాల్లో విమర్శిస్తుంటారో, వాటిని చక్కదిద్దుకోవాల‌ని అనుకుంటుంటాన‌ని తెలిపింది. ఈ సంద‌ర్భంగా షారుఖ్ తో క‌లిసి దీపికా ఫొటోలు దిగింది. ఆ షో సంద‌ర్భంగా దీపిక భావోద్వేగానికి గురైన ఫొటోలు, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. గ‌తంలో కూడా ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా దీపిక చాలా ఎమోష‌న‌ల్ అని షారుక్ చెప్పిన సంగ‌తి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English