2.0 డీల్ ఎన్ని కోట్లకు తెగింది?

2.0 డీల్ ఎన్ని కోట్లకు తెగింది?

ఇండియన్ సినిమాల బడ్జెట్లు.. వాటి మార్కెట్ రోజు రోజుకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది సినిమాల స్థాయి బాలీవుడ్‌లను మించి ఎక్కడికో వెళ్లిపోతోంది. రోబో, బాహుబలి లాంటి సినిమాల సౌత్ సినిమా రేంజే మార్చేశాయి. ఇప్పుడు సౌత్ నుంచి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న మరో సినిమా ‘2.0’.

దీనిపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఏకంగా రూ.400 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీస్తున్నారు. ముందు ఆ బడ్జెట్ చూసి ఔరా అనుకున్నారు కానీ.. ఇప్పుడు దానికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి వస్తున్న బిజినెస్ ఆఫర్లు కళ్లు చెదిరిపోయేలా చేస్తున్నాయి.

‘2.0’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులు మాత్రమే రూ.80 కోట్లు పలకడం విశేషం. దీన్ని బట్టి ఈ సినిమా మిగతా హక్కులు ఏ స్థాయిలో పలికి ఉంటాయో అంచనా వేయొచ్చు. ఈ చిత్రం నాన్-థియేట్రికల్ హక్కులతోనే రూ.100 కోట్ల దాకా రాబట్టే అవకాశముందని అంటున్నారు. శాటిలైట్‌తో పాటు డిజిటల్ హక్కులు కూడా భారీ రేటు పలుకుతున్నాయట. ఆల్రెడీ డిజిటల్ హక్కుల డీల్ కూడా పూర్తయింది.

రూ.25 కోట్ల దాకా ఈ హక్కులు పలికినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య డిజిటల్ హక్కుల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న అమేజాన్ ప్రైమ్ సంస్థ ఈ చిత్రాన్ని సొంతం చేసుకుందట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ కూడా ధ్రువీకరించింది. శాటిలైట్ అన్ని భాషల హక్కులూ ఇంకెంత పలుకుతాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు