‘సైరా’లో వాళ్లయినా ఉంటారా?

‘సైరా’లో వాళ్లయినా ఉంటారా?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న సినిమా ‘సైరా.. నరసింహారెడ్డి’. ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్‌లో ఈ సినిమా తీయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీన్ని ఓ జాతీయ స్థాయి సినిమా చేయడం కోసం అదిరిపోయే కాంబినేషన్ సెట్ చేసింది చిత్ర బృందం.

ఎ.ఆర్.రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా.. రవివర్మన్‌ను ఛాయాగ్రాహకుడిగా.. రాజీవన్‌ను కళా దర్శకుడిగా తీసుకుని.. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, జగపతిబాబు లాంటి పేరున్న నటీనటుల్ని ముఖ్య పాత్రలకు తీసుకున్నారు. దీంతో ఈ సినిమా అనౌన్స్ చేసినపుడు దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరిగింది.

కానీ అనూహ్యంగా ఈ సినిమా నుంచి ముందుగా సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ తప్పుకున్నాడు. ఆయన స్థానంలోకి రత్నవేలు వచ్చాడు. ఇప్పుడు రెహమాన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. అతడి స్థానంలోకి ఎవరిని తేవాలో తెలియట్లేదు. ‘సైరా’ టీం టెక్నీషియన్లు, నటీనటులతో ఒప్పందాలు పూర్తి కాకముందే హడావుడిగా వాళ్ల పేర్లను ప్రకటించేసిందని.. అనుకున్న ప్రకారం సినిమా మొదలవకపోవడం కూడా రవివర్మన్, రెహమాన్ తప్పుకోడానికి కారణమని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో మిగతా నటీనటులు, టెక్నీషియన్లయినా పక్కాగా ఉంటారా.. లేక వాళ్లలో కూడా కొందరు తప్పుకుంటారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతిల విషంయలో డౌట్లు ఉన్నాయి. ఇప్పటిదాకా వీళ్లెవ్వరూ కూడా ‘సైరా’లో తాము నటించబోతున్నట్లు తమకు తాముగా చెప్పుకోలేదు. మెగాస్టార్ సినిమాలో నటిస్తున్నందుకు ఎగ్జైట్ అవుతూ సామాజిక మాధ్యమాల్లో వీరు మెసేజ్‌లు పెడతారని అనుుకుంటే అలాంటిదేమీ జరగట్లేదు. ‘సైరా’ టీం ప్లానింగ్‌లో లోపాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురూ పక్కాగా సినిమాలో ఉంటారా అని చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు