తెలుగు సినిమానే టాప్.. తెలుగులోనే చేస్తా

తెలుగు సినిమానే టాప్.. తెలుగులోనే చేస్తా

ఉత్తరాది నుంచి వచ్చి తెలుగు సినిమాల్లో నటించే ఏ కథానాయికను అడిగితే.. తెలుగు సినిమాలకే తన ప్రాధాన్యం అంటుంది. బాలీవుడ్ గురించి చూద్దాం చేద్దాం అంటారు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి గోల్డెన్ లెగ్ అనిపించుకున్న మెహ్రీన్ కౌర్ అయితే తాను బాలీవుడ్‌కు వెళ్లనంటే వెళ్లనని అంటోంది.

తెలుగు సినిమా కంటే బాలీవుడ్ గొప్పేమీ కాదని ఆమె చెబుతుండటం విశేషం. ప్రస్తుతం తెలుగు సినిమా దేశంలోనే నంబర్‌వన్‌గా ఉందని.. తాను తెలుగులోనే సినిమాలు చేస్తానని ఆమె అంది. తెలుగు సినిమాల్లో నటిస్తున్నందుకు తాను గర్వంగా చెప్పుకుంటానని ఆమె చెప్పడం విశేషం. బాలీవుడ్, టాలీవుడ్ అంటూ ఏ ఇండస్ట్రీని వేరు చేసి మాట్లాడకూడదని ఆమె అంది.

తన విన్నింగ్ స్ట్రీక్‌ను కంటిన్యూ చేస్తూ తన కొత్త సినిమా ‘జవాన్’ కూడా విజయవంతమవుతుందని మెహ్రీన్ చెప్పింది. తన తొలి సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ విడుదలైన రెండో రోజుకే ‘జవాన్’కు సంతకం చేశానని.. తనకు అప్పటికి ఈ సినిమా స్క్రిప్టు కూడా తెలియదని.. దర్శకుడు బి.వి.ఎస్.రవి తన మీద పెట్టిన నమ్మకం చూసి ఈ సినిమా ఓకే చేశానని.. సినిమాలో నటించానని ఆమె అంది. ‘జవాన్’లో తన పాత్ర పేరు భార్గవి అని.. తాను పెయింటర్ పాత్ర చేస్తున్నానని ఆమె వెల్లడించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు