శర్వా.. ఈ స్పీడేంటి నానా!

శర్వా.. ఈ స్పీడేంటి నానా!

వరుస హిట్లతో ఊపుమీదున్న శర్వానంద్‌కు ఈ ఏడాది వేసవిలో ‘రాధ’ పెద్ద షాకిచ్చింది. ఐతే ఈ మధ్యే ‘మహానుభావుడు’తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో శర్వా.. ఒకటికికి మూడు సినిమాల్ని ఒకేసారి లైన్లో పెట్టడం విశేషం.

కొన్ని రోజుల కిందటే హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వా ఓ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లోనూ ఓ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తున్నాడు శర్వా. ఇది కాక హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కూడా ఇంకొన్ని రోజుల్లోనే మొదలవుతుందట.

ఒకేసారి మూడు సినిమాలు మొదలుపెట్టి.. మూడింటికీ డేట్లు సర్దుబాటు చేసి.. మూడు సినిమాల్ని కొంచెం అటు ఇటుగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు వచ్చే ఏడాదే ఈ మూడు సినిమాలూ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వా నటించేది గ్యాంగ్‌స్టర్ మూవీ అంటున్నారు. హనుతో చేసేది లవ్ స్టోరీ అట.

హరీష్ శంకర్ దర్శకత్వంలో శర్వా చేయబోయే సినిమాలో నితిన్ కూడా ఓ హీరోగా నటించనున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించే అవకాశాలున్నాయి. మొత్తానికి శర్వా వరుసబెట్టి క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టాడు. మరి వీటిలో ఏది ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు