ఖాళీగా కూర్చుంటా కానీ...

ఖాళీగా కూర్చుంటా కానీ...

యువ హీరో రామ్‌ 'కందిరీగ'తో హిట్‌ కొట్టిన తర్వాత వరుసగా రెండు దారుణమైన పరాజయాలు చవిచూశాడు. 'ఎందుంటే ప్రేమంట', 'ఒంగోలు గిత్త' చిత్రాలతో పరాజయం పాలైన రామ్‌ ఇప్పుడు వెంకీతో కలిసి 'మసాలా' సినిమాతో వస్తున్నాడు. కందిరీగకి ముందు రెడీతో హిట్‌ కొట్టిన తర్వాత కూడా రామ్‌ని ఫ్లాప్స్‌ వేధించాయి. అయితే అది తాను కోరి తెచ్చుకున్నదేనని రామ్‌ అంటున్నాడు.

వినోదాత్మక చిత్రాలు చేయడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుందని, ఎక్కువ విజయాలు కూడా అందుకోవచ్చునని, కానీ నటుడిగా తనకి సంతృప్తినిచ్చే పాత్రలు, కథల కోసం అన్వేషిస్తుంటానని, వాటి వల్ల ఫ్లాప్స్‌ వస్తాయని తెలిసినా కానీ చేసేస్తుంటానని, ఇకపై కూడా అలాంటి ప్రయోగాలు అయితే మాననని రామ్‌ చెప్పాడు. ఏ కథలు దొరక్కపోతే కొంతకాలం ఖాళీగా కూర్చుంటానని, కందిరీగ ముందు ఏడాదికి పైగా సినిమాలేమీ చేయలేదని రామ్‌ గుర్తు చేస్తున్నాడు. మసాలా మాత్రం తప్పకుండా హిట్‌ అయి తీరుతుందని, ఇలాంటి సినిమాలకి ఎప్పుడూ ఆదరణ ఉంటుందని రామ్‌ చెప్తున్నాడు. ఈసారి అతను అనుకుంటున్నట్టుగానే హిట్‌ వస్తే రామ్‌ జాగ్రత్త పడతాడో లేక మళ్లీ ఫ్లాపుల బాట పడతాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English