సూపర్‌స్టార్‌ మార్కెట్‌ దారుణంగా పడింది

సూపర్‌స్టార్‌ మార్కెట్‌ దారుణంగా పడింది

తమిళ సూపర్‌స్టార్స్‌లో ఒకడైన సూర్యకి తెలుగునాట మంచి మార్కెట్‌ వుంది. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ తర్వాత తెలుగు మార్కెట్‌ని భారీ స్థాయిలో కొల్లగొట్టింది సూర్యనే. అతని సినిమాలకి పద్ధెనిమిది, ఇరవై కోట్లు పలికేవి. శంకర్‌ లేకుండా అంత రేట్‌ తెచ్చుకున్న ఏకైక తమిళ హీరో సూర్య ఒక్కడే. అయితే ఇటీవలి కాలంలో సూర్య మార్కెట్‌ బాగా దెబ్బతింది. అతనికి హిట్‌ వచ్చి చాలా కాలం అవడంతో అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోను మార్కెట్‌ బాగా పడిపోయింది.

ఒక టైమ్‌లో తన పారితోషికం బదులుగా తెలుగు రైట్స్‌ తీసుకున్న సూర్యకి ఇప్పుడు తెలుగు మార్కెట్‌ నుంచి ఎక్కువ డిమాండ్‌ లేదు. సూర్య నటిస్తోన్న తాన సెరింద కూటమ్‌ చిత్రం రైట్స్‌ని గీతా ఆర్ట్స్‌, యువి క్రియేషన్స్‌ సంస్థలు సొంతం చేసుకున్నాయి. తెలుగు డబ్బింగ్‌ రైట్స్‌కి పది కోట్లు ఇచ్చారని ట్రేడ్‌ వర్గాల ద్వారా తెలిసింది. మామూలుగా సూర్య సినిమాలకి వచ్చే దాంట్లో ఇది సగం అన్నమాట.

ఈ చిత్రానికి సింగం లాంటి బ్రాండింగ్‌ లేకపోవడం, పేరున్న దర్శకుడు లేకపోవడం కూడా కారణాలే కానీ ఈ చిత్రంతో అయినా సూర్య హిట్టు కొట్టకపోతే కనుక అతని తదుపరి చిత్రాలకి గిరాకీ మరింతగా పడిపోయే ప్రమాదముంది. అన్నట్టు ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు