ప్రభాస్‌ని ఈసారి లేపేదెవరు?

ప్రభాస్‌ని ఈసారి లేపేదెవరు?

బాహుబలితో జాతీయ వ్యాప్త గుర్తింపు పొందిన ప్రభాస్‌ ఇకపై తన సినిమాలన్నీ పాన్‌ ఇండియా మార్కెట్‌ని టార్గెట్‌ చేసేలా చూసుకుంటున్నాడు. రాజమౌళి బ్రాండ్‌కి బాహుబలి హైప్‌ తోడవడంతో ఆ చిత్రం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అలాగే హిందీలో అంతటి మార్కెట్‌ రావడానికి కరణ్‌ జోహార్‌ బ్రాండింగ్‌ కూడా హెల్ప్‌ అయింది.

మీడియా అటెన్షన్‌ రాబట్టడానికి, బాహుబలిని ఒక అనువాద చిత్రంలా చూడకపోవడానికి కరణ్‌ జోహార్‌ పేరు కూడా కలిసి వచ్చింది.  దీంతో ప్రభాస్‌ 'సాహో'కి కూడా కరణ్‌ సాయం తీసుకుందామని అనుకున్నారు. అయితే బాలీవుడ్‌లో ప్రభాస్‌ని లాంఛ్‌ చేయాలని చూసిన కరణ్‌ జోహార్‌కి అతని డిమాండ్లు నచ్చలేదు. మొదటి సినిమాకే భారీ పారితోషికం అడిగాడని అతనితో సంబంధాలు కట్‌ చేసుకున్నాడు. దీంతో సాహో హిందీ వెర్షన్‌ని మార్కెట్‌ చేసేదెవరనే ప్రశ్న తలెత్తింది.

ప్రభాస్‌కి వున్న క్రేజ్‌ దృష్టిలో వుంచుకుని పలు సంస్థలు ఈ చిత్రం రైట్స్‌ తీసుకోవడానికి సిద్ధంగా వున్నాయి కానీ కరణ్‌ జోహార్‌ మాదిరిగా ప్రోడక్ట్‌కి వేల్యూ యాడ్‌ చేసే బ్రాండ్‌ నేమ్‌ కోసం చూస్తున్నారు. ఫైనల్‌గా సాహో ఎవరి చేతుల్లోకి వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈచిత్రం టీజర్‌ బయటకి వస్తే ఆటోమేటిగ్గా హైప్‌ క్రియేట్‌ అవుతుందనేది మేకర్స్‌ ధీమాగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు