రెహమాన్‌కు వచ్చిన ప్రేమలేఖలు ఏమయ్యాయి?

 రెహమాన్‌కు వచ్చిన ప్రేమలేఖలు ఏమయ్యాయి?

ఎ.ఆర్.రెహమాన్‌ను చూస్తే సంగీతమే జీవితంగా బతుకుతున్నట్లు కనిపిస్తాడు. ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ ఏమీ మీడియాలో కనిపించదు. చిన్నతనంలోనే సంగీతంలో పడిపోయి.. ఆ సముద్రంలోనే మునిగి తేలాడు రెహమాన్. ఐతే తాను ఏ అమ్మాయితోనూ ప్రేమలో పడకపోవడానికి తన అక్కచెల్లెళ్లే కారణమని చెప్పాడు రెహమాన్.

‘‘నేను సంగీత దర్శకుడిగా మారాక నాకు చాలామంది ప్రేమలేఖలు రాయడం మొదలుపెట్టారు. మా ఇంటికి చాలా ప్రేమలేఖలు వచ్చేవట. కానీ నా అక్క చెల్లెళ్లు వాటిని దాచేశారు. ఒక్కటీ నా దగ్గరికి రానివ్వలేదు. చాలా లేఖల్ని చించేశారట. ఆ విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఇలాంటి అక్కచెల్లెళ్లు ఉన్నపుడు నేనెక్కడ ఏ అమ్మాయినైనా ప్రేమిస్తాను’’ అంటూ ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ నవ్వేశాడు.

తాను సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించే మొదట్లో స్టూడియో పెట్టడం కోసం డబ్బులు లేకపోతే తన తల్లి నగలు ఇచ్చిందని.. 28 ఏళ్ల కిందట కట్టిన ఆ స్టూడియోలోనే తన తొలి జింగిల్స్ చేశానని.. మణిరత్నంకు తన తొలి బాణీ వినిపించింది కూడా ఆ స్టూడియోలోనే అని.. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించాక తన తల్లికి అంతకుముందున్న నగల్లో మూడింతలు కొనిచ్చినట్లు రెహమాన్ చెప్పాడు. కడపలో పెద్ద దర్గాకు తరచూ రావడం గురించి రెహమాన్ మాట్లాడుతూ.. అక్కడికి వస్తే తన ఒత్తిడంతా మరిచిపోయి ప్రశాంతత కూడగట్టుకుంటానని రెహమాన్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English