ఆరడుగులకు తగ్గేదే లేదంటున్న రకుల్

ఆరడుగులకు తగ్గేదే లేదంటున్న రకుల్

తనకు కాబోయే వరుడి విషయంలో తన డిమాండ్లు తనకున్నాయని అంటోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తనను చేసుకోబోయేవాడికి ఉండాల్సిన మొదటి అర్హత ఆడుగుల ఎత్తు అని ఆమె స్పష్టం చేసింది. తాను పొడవైన అమ్మాయిని కాబట్టి.. అబ్బాయి ఆరడుగులు లేకుంటే బాగోదని.. ఈ డిమాండ్ విషయంలో తాను తగ్గేదే లేదని ఆమె స్పష్టం చేసింది.

90 శాతం అబ్బాయిలు ఈ విషయంలో ఫిల్టర్ అయిపోతారని.. మిగతా పది శాతం మంది అబ్బాయిల నుంచి తాను వరుడిని చూజ్ చేసుకోవాల్సి ఉంటుందని.. అతను మంచి వ్యక్తి అయి ఉండాలని.. తనలాగే చాలా చురుగ్గా ఉండాలని.. తాను ఇంత చురుగ్గా ఉండి.. అబ్బాయి డల్లుగా ఉంటే సూటవ్వదని రకుల్ స్పష్టం చేసింది. వీటన్నింటికీ మించి తనకు.. అతడికి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండటం చాలా కీలకమని.. ఫుల్ యాటిట్యూడ్ ఉంటే మాత్రం చెంప దెబ్ కొట్టేస్తానేమో అని రకుల్ చెప్పింది.

తన కోస్టార్స్ లో ఎవ్వరూ ఇప్పటిదాకా తనకు ప్రపోజ్ చేయలేదని.. తనను ఆ దృష్టితో ఎవరూ చూడలేదని.. తాను అందరితో చాలా త్వరగా ఫ్రెండ్ అయిపోవడం.. టామ్ బాయ్ లాగా ఉండటం దీనికి కారణాలని భావిస్తున్నానని రకుల్ చెప్పింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చి ఆరేళ్లయిందని.. ఇప్పటిదాకా తనకు ఎవరూ ప్రపోజ్ చేయట్లేదేంటని అప్పుడప్పుడూ ఆలోచిస్తూ ఉంటానని రకుల్ అంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు