హీరో చెట్టయితే.. మేము కొమ్మలం

హీరో చెట్టయితే.. మేము కొమ్మలం

ఒక సినిమాకి దర్శకులకంటే ఎక్కువ స్థాయిలో కష్టపడే వారిలో సంగీత దర్శకుడు ఒకడు. సినిమాకి వైస్ కెప్టెన్ గా ఉండే అతను కెప్టెన్ శైలిని కరెక్ట్ గా క్యాచ్ చేస్తేనే సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో హిట్ అవుతోంది. ప్రస్తుతం అలాంటి సంగీత దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. అలాంటి వారిలో థమన్ ఒకరు. ఎనిమిదేళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి సంగీత దర్శకుల దిగ్గజాల దగ్గర పనిచేసిన థమన్ తన 25 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఈజీగా ఆఫ్ సెంచరి కొట్టేశాడు. ఈ సందర్భంగా రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో థమన్ కొన్ని విషయాలను చెప్పాడు.

నా సినిమా కెరీర్ లో 64 మంది సంగీత దర్శకుల దగ్గర 900 సినిమాలకు పనిచేశా. అందులో ఎక్కువగా 95 సినిమాలకు గాను మణిశర్మ గారి దగ్గరే వర్క్ చేశా. ఇక కీరవాణి దగ్గర 25 సినిమాలకు వర్క్ చేశాను. ముఖ్యంగా అన్నమయ్య సినిమాలో గుడి తలుపులు తెరుచుకునేటప్పుడు గుడి గంటల సౌండ్ నేనె క్రియేట్ చేశాను. అప్పుడు నాకు పద్నాలుగేళ్లు. దర్శకులు కే. రాఘవేంద్రరావు గారు కూడా నన్ను చాలా మెచ్చుకున్నారు. ఇక ఏర్. రెహమాన్ - దేవిశ్రీప్రసాద్ అండ్ ఆర్పీ. పట్నాయక్ వంటి వారి దగ్గర వివిధ రకాల వాయిద్యాలను వాయించేవాడిని. వారి దగ్గర వర్క్ చేసిన అనుభవం నాకు చాలా ఉపయోగపడుతోంది.

ఇప్పటి వరకు 70 సినిమాలను క్రాస్ చేశాను. ఇక మీదట ఎక్కువగా లవ్ స్టోరీస్ చేద్దామని అనుకుంటున్నా. రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా గోల్ మాల్ ఎగైన్ చేశాను. త్వరలో టెంపర్ రీమేక్ కి కూడా సంగీతం అందించబోతున్నా. మెలోడీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే కమర్షియల్ సినిమాలో ఆ తరహా సాంగ్ చేయమని ఒక్క చాన్స్ ఇచ్చినా చాలా ఇష్టంగా జాగ్రత్తగా చేస్తాను. ఇక హారర్ సినిమాలకు థమన్ మ్యూజిక్ చాలా బాగా ఇస్తాడని పేరొచ్చింది. అయితే ఆ సినిమలకు మెయిన్ గా మ్యూజిక్ చాలా అవసరం. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అందుకే ఎక్కువ స్థాయిలో వర్క్ చేయాల్సి ఉంటుంది.

ఎక్కువ సినిమాలు చేస్తున్నపుడు ట్యూన్లు రిపీట్ కాకుండా ఉండాలంటే కమర్షియల్ సినిమాలను చేయడం కాస్త తగ్గించాలి. అప్పుడే కొత్త ట్యూన్స్ చేయడానికి ఆస్కారం వుంటుంది. ఇక స్టార్ హీరోల సినిమాలను చేసేటప్పుడు వారి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. అది నేను చాలా ఆలోచిస్తాను. ఎందుకంటే వారు చెట్టు అయితే సాంకేతిక విభాగం కొమ్మల లాంటి వారు. మేము కలిసి పనిచేస్తేనే చెట్టుకు బలం చేకూరుతుంది.

ఇక ప్రస్తుత రోజుల్లో కొత్త గాయకులు చాలావరకు పుట్టుకొస్తున్నారు. టాలెంట్ ను నిరూపించుకోవడానికి వేధికలు అవకాశాలు కూడా చాలానే వస్తున్నాయి. అయితే ఈ తరం వారు 5వ తరగతి అయిపోగానే 10వ తరగతికి జంప్ చేయాలనే విధంగా డైరెక్ట్ గా అవకాశాలు ఇవ్వండని వస్తున్నారు. కానీ వేదికలపై పాడినంత మాత్రాన సరిపోదు ఇంకా సాధన అవసరమని థమన్ తెలియజేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు