అన్నం పెట్టిన దేవుడు మెగాస్టార్

అన్నం పెట్టిన దేవుడు మెగాస్టార్

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఎవరో ఒకరి సహకారంతో వచ్చినవారే. సినీ హీరోల అవకాశం ఇస్తారేమో అని ఎంతో మంది ప్రయత్నాలు చేస్తారు. కానీ అందరికి అవకాశం దక్కదు. ఇక మెగాస్టార్   తన కెరీర్లో ఎంతో మందికి అవకాశం కల్పించారు. ముఖ్యంగా రచయితలకు ఆయన అందించిన సహకారాలు చాలానే ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఒక రచయిత నటుడు మెగాస్టార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

ఆయన ఎవరో కాదు.. రైటర్ తోటపల్లి మధు. ఇండస్ట్రీలో ఈయన ఎక్కువగా అందరికి ఒక నటుడుగానే పరిచయం. సినిమా చూపిస్తా మావా సినిమాలో రాజ్ తరుణ్‌ తండ్రిగా ఇరగదీశారు. కానీ ఆయన ముందుగా కొన్ని సినిమాలకు రైటర్ గా కూడా వర్క్ చేశారు. 19 ఏళ్ల వయసులోనే మెగాస్టార్ కి కథ చెప్పి మెప్పించారట. అయితే ఆయనకు మొదటి కథ చెప్పినపుడు తనలో ఒక గొప్ప నటుడు ఉన్నాడని చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి చిరంజీవి గారే అని మధు తెలిపారు.

ఇంకా ఏమన్నారంటే.. నాకు మొట్ట మొదటి సినీ జీవితాన్ని ఇచ్చింది చిరంజీవి గారే. అలాగే నాకు అన్నంపెట్టి ఆదరించారు. ఆయన గొప్ప మెగాస్టారే కాదు. మాంచి మానవత్వం గల వ్యక్తి నా జీవితంలో నేను ఎక్కువగా ఆరాధించే వ్యక్తి ఆయన. ఇప్పటికి నేను ఈ స్థానంలో ఉన్నాను అంటే అందుకు చిరంజీవి గారే కారణం. అలాంటి వ్యక్తులు సాధారణంగా సూపర్ స్టార్స్ అవ్వరు. మంచి వ్యక్తిత్వం ఉంటేనే స్టార్స్ అవుతారని తోటపల్లి మధు వివరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English