మహేష్ ఫ్యామిలీ నుంచి ఇంకొకరి డెబ్యూ

మహేష్ ఫ్యామిలీ నుంచి ఇంకొకరి డెబ్యూ

తెలుగులో మిగతా సినీ కుటుంబాలతో పోలిస్తే సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి పూర్తి స్థాయిలో ఇండస్ట్రీలోకి వచ్చి.. అందులోనే కొనసాగుతున్న వాళ్లు తక్కువ. ఒక్క మహేష్ బాబు మాత్రమే నిలకడగా ఇండస్ట్రీలో ఉన్నాడు. అతడి అన్న రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేసి.. ఆ తర్వాత నిర్మాతగా కూడా ఒకట్రెండు సినిమాలు చేసి.. ఆ తర్వాత గుడ్ బై చెప్పేశాడు. హీరోయిన్ కావాలనుకున్న కృష్ణ కూతురు మంజుల.. ఆ కోరికను నెరవేర్చుకోలేకపోయింది. ఆ తర్వాత ఒకట్రెండు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి.. రెండు మూడు సినిమాలు ప్రొడ్యూస్ చేసి.. ఆ తర్వాత సైలెంటైంది. ఇప్పుడామె దర్శకురాలిగా మారుతోంది. ఇక తర్వాతి తరంలో మహేష్ కొడుకు గౌతమ్ ఒక క్యామియో చేశాడు. రమేష్ బాబు తనయుడు కూడా ఒక సినిమాలో తళుక్కుమన్నాడు.

ఇప్పుడు కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరంలో ఇంకొకరు తెరంగేట్రం చేయబోతున్నారు. అది ఎవరో కాదు.. మంజుల కూతురు జాన్వి. తన తల్లి దర్శకత్వంలోనే జాన్వి సినిమా చేస్తుండటం విశేషం. యువ కథానాయకుడు సందీప్ కిషన్‌తో మంజుల దర్శకురాలిగా తన తొలి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వి ఓ కీలక పాత్ర చేస్తోంది. ఇందులో హీరోయిన్ మరొకరు ఉన్నారు. జాన్వి హీరోయిన్ టైపులో కాకుండా కీలక పాత్ర చేస్తోందట. ఈ టీనేజీ అమ్మాయికి మున్ముందు హీరోయిన్ అయ్యే ఆలోచనలు కూడా ఉన్నాయట.

తాను హీరోయిన్ కావాలనుకున్నపుడు అందరూ తనకు అడ్డం పడగా.. తన కూతురి విషయంలో మాత్రం అలా జరగకూడదని మంజుల పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. తన కూతురు కెమెరా ముందు ఏమాత్రం భయెపడకుండా బాగా నటించిందని.. అప్పుడామెను చూస్తే చిన్నప్పటి మహేష్ గుర్తొచ్చాడని మంజులే కితాబివ్వడం విశేషం. మరి మహేష్ మేనకోడలు మున్ముందు ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English