ఈ సెన్సేషనల్ ట్రైలర్ చూశారా?

 ఈ సెన్సేషనల్ ట్రైలర్ చూశారా?

తమిళనాట నిన్నట్నుంచి ఒక సినిమా ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆ సినిమా పేరు.. ‘టిక్ టిక్ టిక్’. జయం రవి కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. ఇ:తకీ ఈ సినిమా ప్రత్యేకత ఏంటి అంటే.. ఇండియాలో తెరకెక్కిన తొలి పూర్తి స్థాయి స్పేస్ మూవీ ఇదేనట. ఇంతకుముందు అంతరిక్షం నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి కానీ.. వాటిలో స్పేస్ గురించి ఊరికే అలా టచ్ చేశారు అంతే.

పూర్తి స్థాయి స్పేస్ మూవీ అన్నది ఇండియాలో ఇప్పటిదాకా రాలేదు. హాలీవుడ్ నుంచి మాత్రమే ఇలాంటి సినిమాలు వస్తుంటాయి. వాటిని చూసి మన ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఐతే శక్తి సౌందర్ రాజన్ అనే దర్శకుడు తమిళంలో ఫుల్ లెంగ్త్ స్పేస్ మూవీ తీసేశాడు. ఈ సినిమా ట్రైలరే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

‘టిక్ టిక్ టిక్’ కథాంశం విషయానికి వస్తే తమిళనాడు ప్రాంతంలోకి ఒక ఆస్టరాయిడ్ వచ్చి పడి ఒక ప్రాంతం ధ్వంసమవుతుంది. ఐతే కొన్ని వారాల తర్వాత ఇంకో పెద్ద ఆస్టరాయిడ్ భూమి మీద పడబోతోందని.. అది పడితే భారీ నష్టం వాటిల్లుతుందని సైంటిస్టులకు తెలుస్తుంది. ఆ ఆస్టరాయిడ్‌ను ఆపడానికి ఒక మిసైల్ ప్రయోగించాల్సి ఉంటుంది. ఆ మిస్సైల్  శత్రువల చేతుల్లో ఉంటుంది. దాన్ని తీసుకొచ్చేవాడే మన హీరో.

అతను మెజీషియన్ కమ్ ఎస్కేప్ ఆర్టిస్ట్. మరి ఈ హీరో ఆ టాస్క్ ఎలా పూర్తి చేశాడన్నది ఈ సినిమా కథ. ట్రైలర్ చూస్తే ఇందులో స్పేస్ తాలూకు స్పెషల్ ఎఫెక్టులు బాగానే చేసినట్లున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు