అమ‌లాపాల్‌... కారు కొంటే ట్యాక్స్ క‌ట్ట‌వా?

అమ‌లాపాల్‌... కారు కొంటే ట్యాక్స్ క‌ట్ట‌వా?

అమ‌లాపాల్... ఈ పేరు చెబితే చాలు వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే సెల‌బ్రిటి అన్న మాటే గుర్తుకు వ‌స్తుంది. కెరీర్ ఏమంత ఎత్తుకు ఎద‌గ‌ని స‌మ‌యంలోనే పెళ్లి పీట‌లు ఎక్కేసిన అమ‌లాపాల్... ఆ పెళ్లి తంతును కూడా క్ష‌ణాల్లోనే తుంచేసుకుంది. ఆ త‌ర్వాత త‌న భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న విష‌యాన్ని స్వ‌యంగా తానే వెల్ల‌డించేసి... మ‌గాళ్లు మాత్ర‌మే విడాకులు తీసుకోవాలా?  మేమేం త‌క్కువ తిన్నామ‌న్న కోణంలో ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న‌లు చేసిన పెద్ద దుమారాన్నే రేపింది. గ‌డ‌చిన కొన్నేళ్లుగా సినీ ఇండ‌స్ట్రీలో ఉన్న ఈ భామ‌కు అంత పెద్ద గుర్తింపేమీ రాలేదు గానీ... పెళ్లి అయిన కొద్ది కాలానికే విడాకులు తీసుకోవ‌డంతో మాత్రం అంద‌రి దృష్టినీ ఈమె ఆకర్షించింద‌నే చెప్పాలి.

విడాకుల త‌ర్వాత త‌నదైన శైలిలో గ్లామ‌ర్ ఒల‌క‌బొస్తూ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తూ వ‌స్తున్న అమ‌లాపాల్.. ఇక గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు కూడా తాను వెనుకాడేది లేద‌ని నిర్మాత‌ల‌కు ప‌రోక్షంగానే సిగ్న‌ల్స్ ఇచ్చేసింది. ఇటీవ‌ల తాను ఓ ల‌గ్జ‌రీ కారు కొన్నాన‌ని, మ‌గాళ్లు మాత్ర‌మే ఆ త‌ర‌హా కార్లు కొనాలా? అంటూ కూడా అమ‌లాపాల్ గొప్ప‌లు పోయిన సంగతి తెలిసిందే. ఇదంతా బాగానే ఉన్నా... బ‌డాయిల‌కు పోయిన ఈ భామ‌కు ఇప్పుడు ఆదాయ‌ప‌న్ను శాఖ భారీ షాకే ఇచ్చింద‌ని చెప్పాలి. ల‌గ్జ‌రీ కారు కొంటే త‌ప్పేమీ లేద‌ని, అయితే ఆ కారుకు ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ మాటేమిటంటూ ఐటీ శాఖ అమ‌లాపాల్‌పై ఏకంగా కేసు న‌మోదు చేసింది. దీంతో మొన్న‌టిదాకా ల‌గ్జ‌రీ కారు అంటూ మురిసిపోయిన అమలాపాల్‌కు ఇప్పుడు త‌ల‌బొప్పి క‌ట్టినంత ప‌నైంద‌నే చెప్పాలి.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... కేర‌ళ‌లో ల‌గ్జ‌రీ కార్ల‌పై 20 శాతం ప‌న్ను విధిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ లెక్క‌న ఎంత లేద‌న్నా కోటి రూపాయ‌ల‌కు పై చిలుకు ధ‌ర ప‌లికే ల‌గ్జ‌రీ కారు కొన్న అమ‌లాపాల్ కూడా ప్ర‌భుత్వానికి రూ.20 ల‌క్ష‌ల మేర ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. అయితే ఈ ట్యాక్స్‌ను త‌ప్పించుకునేందుకు ప్లాన్ వేసిన అమ‌లాపాల్‌... ట్యాక్స్ త‌క్కువ‌గా ఉండే పుదుచ్ఛేరిలో రిజిస్ట్రేష‌న్ చేయించింద‌ట‌. అయితే కారును మాత్రం ఆమె కేర‌ళ‌లోనే కొన‌నుగోలు చేసిన‌ట్లు గుర్తించిన  ఐటీ శాఖ ఆమెపై ఇప్పుడు కేసు న‌మోదు చేసింది. అమ‌లాపాల్ తో పాటు కేర‌ళకే చెందిన మ‌రో న‌టుడు ప‌హ‌ద్ ఫాసిల్‌పైనా కేసు న‌మోదు చేసిన‌ట్లు ఐటీ శాఖ వెల్ల‌డించింది. మ‌రి ఈ కేసు నుంచి అమ‌లాపాల్ ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు