నారా రోహిత్‌కు బెస్ట్ ఫ్రెండే షాకిస్తాడా?

నారా రోహిత్‌కు బెస్ట్ ఫ్రెండే షాకిస్తాడా?

నారా రోహిత్‌కు సినీ పరిశ్రమలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే.. మరో మాట లేకుండా శ్రీవిష్ణు అని చెప్పేస్తారు ఇండస్ట్రీ జనాలు. కెరీర్ ఆరంభం నుంచి ఒకరికొకరు తోడ్పాటు అందించుకుంటూ సాగిపోతున్నారు ఈ యువ కథానాయకులు. శ్రీవిష్ణుకు రోహిత్ తన సినిమాల్లో అవకాశాలివ్వడమే కాక.. అతడి కోసం ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు కూడా.

శ్రీవిష్ణు కూడా రోహిత్‌కు క్రియేటివ్ సపోర్ట్ ఇస్తూ వచ్చాడు. ఇంత థిక్ ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ శుక్రవారం బాక్సాఫీస్ పోరుకు రెడీ అవుతుండటం విశేషం. రోహిత్ సినిమా ‘బాలకృష్ణుడు’తో పాటు శ్రీవిష్ణు మూవీ ‘మెంటల్ మదిలో’ కూడా ఒకే రోజు విడుదలవుతున్నాయి.

ఐతే వీటిలో పాజిటివ్ బజ్ ఉన్నది ‘మెంటల్ మదిలో’ సినిమాకే. ‘పెళ్లిచూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి ‘పెళ్లిచూపులు’ తరహాలోనే దీనికి కూడా ముందే ప్రివ్యూలు వేశాడు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా హిట్ అని ముందే ఇండస్ట్రీ జనాలు తీర్మానించేశారు. ఆల్రెడీ కొన్ని రివ్యూలు కూడా వచ్చేశాయి. మొత్తానికి సినిమా బాగానే ఆడేలా కనిపిస్తోంది.

ఐతే నారా రోహిత్ సినిమా ‘బాలకృష్ణుడు’ మీదే కొంచెం సందేహాలున్నాయి. ఎప్పుడూ కొత్త తరహా సినిమాలు చేసే రోహిత్.. ఈసారి రొటీన్ కమర్షియల్ కథను ట్రై చేసినట్లున్నాడు ‘బాలకృష్ణుడు’లో. ఇప్పుడు ఈ తరహా కథలు పెద్దగా ఆడట్లేదు. ఈ సినిమాకు ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి టాక్ ఎలా వస్తుందో చూడాలి. ఈ సినిమాకు ఆశించిన టాక్ రాకపోతే.. రోహిత్ ఫ్రెండు సినిమానే దీన్ని దెబ్బ కొట్టడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English