థర్టీ ఇయర్స్ పృథ్వీ.. 30 తర్వాతైనా వస్తుందా?

థర్టీ ఇయర్స్ పృథ్వీ.. 30 తర్వాతైనా వస్తుందా?

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఒక్క డైలాగ్ తో టాలీవుడ్ ఆడియన్స్ లో గుర్తింపు సంపాదించిన కమెడియన్ పృథ్వీకి.. 2014లో వచ్చిన లౌక్యం మూవీలో పోషించిన బాయిలింగ్ స్టార్ బబ్లూ పాత్ర విపరీతమైన క్రేజ్ ను ఆపాదించి పెట్టింది. ఒక్కసారిగా స్టార్ కమెడియన్ అయిపోయినా.. లౌక్యం తర్వాత మళ్లీ ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చిన రోల్ కానీ.. జనాలకు గుర్తుండిపోయే పాత్ర కానీ ఒక్కటి కూడా రాలేదు.

లౌక్యం తర్వాత ఇప్పటికి 30కి పైగానే సినిమాల్లో నటించాడు పృథ్వీ. ఇన్ని సినిమాల్లో ఒక్కటి కూడా క్లిక్ కాకపోవడం ఆశ్యర్యకరమే. అయితే.. ఇప్పుడు పృథ్వీలో ఉన్న ట్యాలెంట్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే పాత్ర ఒకటి పర్ఫెక్ట్ గా తగిలిందనే టాక్ వినిపిస్తోంది. నారా రోహిత్ హీరోగా నటించిన బాలకృష్ణుడు మూవీలో పృథ్వీ పోషించిన పాత్ర ఆడియన్స్ ను విపరీతంగా మెప్పించడం ఖాయమట. ఈ సినిమాలో హీరో తర్వాత.. జనాలను ఆకట్టుకునే రోల్ కూడా ఇదే అంటున్నారు.

కొత్త దర్శకుడు పవన్ మల్లెల.. పృథ్వీ కోసమే ఈ పాత్రను సృష్టించి.. బోలెడన్ని నవ్వులు పూయించాడనే టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణుడు మూవీలో చేసిన రోల్ తో.. బాయిలింగ్ స్టార్ ట్యాగ్ ను కూడా మరిపించేసే రేంజ్ లో తనలోని కామెడీ యాంగిల్ ని.. టైమింగ్ ను పృథ్వీ ప్రదర్శించాడని అంటున్నారు. ఇవన్నీ నిజమే అయితే.. నిజంగా పృథ్వీకి మళ్లీ సూపర్ గుడ్ టైమ్స్ స్టార్ట్ అయినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English