అమీ తప్ప ఎవరూ దొరకలేదా?

అమీ తప్ప ఎవరూ దొరకలేదా?

అమీ జాక్సన్ అంటే బ్రిటన్ అందం అనే విషయం తెలిసిందే. అక్కడి నుంచి వచ్చి.. ఇండియాలో బాగానే పాగా వేసింది అమీ. ఇతర విదేశీ భామల మాదిరిగా కాకుండా.. పెద్ద పెద్ద ప్రాజెక్టులలో లీడ్ హీరోయిన్ రోల్స్ ను అందుకోవడంలో బాగానే సక్సెస్ అయింది.

కేరక్టర్స్ ఎంచుకోవడంలో కూడా ఈమె పాటించే టెక్నిక్ అంతుపట్టక చాలామందికి విస్తుపోతుంటారు. అప్పట్లో ఎవడు అంటూ ఓ టాలీవుడ్ మూవీలో కనిపించిన ఈ భామ.. ఇప్పుడు ఇండియాలో అతి ఎక్కువ బడ్జెట్ తో రూపొందిన రజినీకాంత్ మూవీ 2.ఓ లో కూడా రోబో మాదిరిగా సందడి చేయనుంది. అల్ట్రా మోడర్న్ క్యారెక్టర్ల విషయంలో అమీని మించినోళ్లు మరొకళ్లు లేరనే మాట ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడీ వయ్యారి ఓ కన్నడ సినిమాలో నటిస్తోంది. దేవరు ప్రితియ ఒలాగే అనే కన్నడ చిత్రంలో నటించేందుకు యాక్సెప్ట్ చేయగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సుదీప్ ఈ చిత్రంలో నటిస్తుండగా.. మైసూర్ లో ఓ పాట చిత్రీకరణ చేస్తున్నారు. ఈ పాటలో అమీ గెటప్ చూసి ఆశ్చర్యపోవాల్సిందే.

అచ్చమైన భారతీయ యువతి మాదిరిగా కనిపిస్తోంది అమీ జాక్సన్. ఇంత నేటివిటీగా కనిపించాల్సిన పాత్రకు.. అసలు ఇండియన్ ఎవరూ దొరకనట్లుగా బ్రిటన్ భామను తీసుకోవడం విస్తుపోవాల్సిన విషయమే. తన బాడీ బికినీ వేసుకునేందుకు పర్ఫెక్ట్ అని ధైర్యంగా చెప్పగల అమీ జాక్సన్ ను..  మూవీ అంతా ఇదే గెటప్ లో చూపిస్తారో.. లేక పాట కోసం ఇలా ట్రై చేశారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English