విష్ణు ‘ఓటర్’.. తమిళ పోస్టర్ చూశారా?

విష్ణు ‘ఓటర్’.. తమిళ పోస్టర్ చూశారా?

మంచు విష్ణు చాన్నాళ్ల తర్వాత మంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో వచ్చాడు. అతడి కొత్త సినిమా ‘ఓటర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న రాత్రే సోషల్ మీడియాలోకి వచ్చింది. ఇది ఇన్‌స్టంట్‌గా జనాలకు ఎక్కేసింది. తెలుగు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖుల ముఖ చిత్రాలు చూపిస్తూనే వాళ్ల మధ్య విష్ణు ముఖాన్ని చాలా ఇంటెన్స్‌గా చూపిస్తూ ఓటు వేసినట్లు సూచిస్తున్న వేలిని కూడా ఎలివేట్ చేస్తూ పోస్టర్ డిఫరెంటుగా డిజైన్ చేశారు. చాలా వరకు సరదా పాత్రలే చేసే విష్ణు.. ఈ సినిమాలో సీరియస్, ఇంటెన్స్ క్యారెక్టర్ చేస్తున్నట్లుగా ఉంది ఫస్ట్ పోస్టర్ చూస్తే.

విశేషం ఏంటంటే.. ‘ఓటర్’ సినిమాతోనే విష్ణు తమిళంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతను చేస్తున్న తొలి ద్విభాషా చిత్రం కూడా ఇదే. తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు తమిళ పోస్టర్‌ను కూడా ఒకేసారి రిలీజ్ చేయడం విశేషం. తెలుగు పోస్టర్లో ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్, దాసరి నారాయణరావు, చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, హరికృష్ణ దేవినేని విష్ణు, నారా లోకేష్, వాజ్ పేయి, నరేంద్ర మోడీ, కేసీఆర్, కేటీఆర్, కవిత.. లాంటి వాళ్ల ముఖచిత్రాలు చూపించిన ‘ఓటర్’ టీం.. తమిళ పోస్టర్‌ను విషయంలో అక్కడి వాళ్లకు కనెక్టయ్యేలా తీర్చిదిద్దింది. అందులో పెరియార్, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, స్టాలిన్, విజయ్ కాంత్ లాంటి వాళ్ల ముఖాలతో పోస్టర్ డిజైన్ చేశారు. అక్కడి జనాలకు కూడా ఈ ఫస్ట్ లుక్ బాగానే నచ్చినట్లుగా ఉంది. మొత్తానికి ఫస్ట్ లుక్‌తో జనాల్లో బాగానే క్యూరియాసిటీ తీసుకు రాగలిగింది ‘ఓటర్’ టీం. ‘అడ్డా’ ఫేమ్ కార్తీక్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు