మెడికల్ సీటు కోసం చిరు ఇంటికి రాజశేఖర్..

మెడికల్ సీటు కోసం చిరు ఇంటికి రాజశేఖర్..

కొన్నేళ్ల కిందట రాజశేఖర్ మీద మెగాస్టార్ అభిమానులు దాడికి ప్రయత్నించడం.. ఈ నేపథ్యంలో చిరంజీవి స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్లి సారీ చెప్పడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు అలాగే ఉండిపోయి.. అంతరం కొనసాగడం తెలిసిందే. ఐతే ఇటీవల ‘గరుడవేగ’ సినిమా విడుదల నేపథ్యంలో రాజశేఖర్ తన భార్య జీవితలో కలిసి రాజశేఖర్ ఇంటికి వెళ్లి ఆయన్ని సినిమా చూసేందుకు ఆహ్వానించడంతో ఇరువురి మధ్య ప్యాచప్ అయిందని అందరూ భావించారు. ఐతే తామిద్దరం కొత్తగా కలుసుకున్నదేమీ లేదని.. అంతకుముందే తమ మధ్య విభేదాలు తొలగిపోయాయని రాజశేఖర్ చెప్పాడు. గతంలో తన కూతురి మెడికల్ సీటు కోసం తాను చిరు ఇంటికి వెళ్లి కలిసినట్లు ఆయన వెల్లడించాడు.

‘‘చిరు గారితో నాకు విభేదాలు వచ్చాక కొన్నేళ్లు దూరంగా ఉండిపోయాను. కానీ ఆ తర్వాత అప్పుడప్పడూ కలుస్తూనే ఉన్నాం. ‘మేముసైతం’తో పాటు వేరే ఫంక్షన్లలో కలిశాం. అప్పుడు హాయ్ అంటే హాయ్ అనుకున్నాం అంతే. ఐతే ఒకసారి మా అమ్మాయి శివాని మెడికల్ సీటు కోసం అపోలో మెడికల్ కాలేజీలో అప్లై చేశాం. ఆ విషయంలో సపోర్ట్ కోసం జీవిత.. చిరంజీవి గారి ఇంటికి వెళ్లింది. జీవిత వెళ్లగానే చిరంజీవి గారు నా గురించి అడిగారట. దీంతో జీవిత వెంటనే నాకు కాల్ చేసి రమ్మని చెప్పింది. కానీ నేను రెడీ అయి లేను. దీంతో ఆమె వెనక్కి వచ్చి నన్ను తీసుకెళ్లింది. చిరంజీవి గారు అప్పుడు బాగా మాట్లాడారు. మాకు అవసరమైన సాయం చేశారు. ఆ తర్వాత మేమిద్దరం బాగా కలిసిపోయాం. ‘గరుడవేగ’ విషయంలో ఆయన చాలా సపోర్ట్ చేశారు’’ అని రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు