స్టూడియో కడితే ఇండస్ట్రీ కదులుతుందా?

స్టూడియో కడితే ఇండస్ట్రీ కదులుతుందా?

ఇప్పుడు నంది అవార్డుల వివాదం కారణంగా.. మరోసారి ఏపీకి టాలీవుడ్ తరలివెళ్లడం అనే అంశం బయటకు వచ్చింది. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అన్న పదం.. తెలుగు సినీ సెలబ్రిటీలను బాగానే రెచ్చగొట్టింది. తెలుగు సినీ పరిశ్రమ అమరావతిలో ఏర్పాటు కావాలన్నది ప్రభుత్వ ఆలోచన అయితే.. అందుకు తగ్గ సౌకర్యాలను.. స్థలాలను అందిచాలన్నది సినిమా వర్గాల వాదన.

ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం.. స్టూడియో కట్టేందుకు స్థలం అందిస్తే.. రామానాయుడు స్టూడియోను అమరావతిలో నిర్మిస్తామని చెప్పారట నిర్మాత సురేష్ బాబు. ప్రస్తుతం హైద్రాబాద్ తో పాటు.. విశాఖ పట్నంలోను రామానాయుడు స్టూడియో ఉంది. నెల్లూరు జిల్లాలోని శ్రీ సిటీలో కూడా స్టూడియో కడతారనే టాక్ గతంలోనే వినిపించింది. ఏపీ-తమిళనాడు బోర్డర్ కావడంతో.. శ్రీ సిటీ స్టూడియోకి.. తెలుగు-తమిళ పరిశ్రమల నుంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నారట. ఇప్పుడు అమరావతిలో ఓ స్టూడియో కట్టడంపై కూడా సమాలోచనలు జరుగుతున్నాయని అంటున్నారు.

నిజానికి విశాఖలో స్టూడియో ఎప్పటి నుంచో ఉన్నా.. సినీ పరిశ్రమ హైద్రాబాద్ నుంచి కదిలిందేమీ లేదు. సురేష్ బాబే కాదు.. వేరే ఎవరైనా సరే.. ఇప్పుడు అమరావతిలో కొత్త స్టూడియో కట్టేసినంత మాత్రాన.. టాలీవుడ్ తరలింపు అంత సులభమైన పనేమీ కాదు. కాకపోతే.. వీరికి మరికొన్ని స్టూడియోలు జతవుతాయంతే అంటున్నారు సినీ జనాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు